ఫోటో: చిరంజీవి 10వ తరగతి సర్టిఫికెట్‌పై ఓ లుక్కేయండి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 10వ తరగతి సర్టిఫికెట్ ఎప్పుడైనా చూసారా? చూడక పోతే దానిపై ఓ లుక్కేయండి. చిరంజీవి పూర్తి పేరు, అసలు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే విషయం తెలిసిందే. వెండి తెరపై మాత్రం ఆయన పేరు చిరంజీవి. ఆ తర్వాత దాన్నే తన అసలు పేరుగా మార్చుకున్నారు.
సర్టిఫికెట్ లోని వివరాలు...
పేరు: కె.ఎస్.ఎస్. వర ప్రసాద రావు (కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ రావు)
తండ్రి పేరు: వెంకట్రావు
నేషనాలిటీ: ఇండియన్, హిందు, తెలుగు
లింగం: పురుష
పుట్టిన తేదీ: 22.08.1955
పుట్టిన స్థలం: పెనుగొండ
ఇతర వివరాల్లోకి వెళితే...
మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు చేస్తారో అంటూ అభిమానులంతా చాలా కాలం నుంచి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తనకు సినిమా చేసే సమయం లేక పోయినా, వారిని నొప్పించకుండా ఉండటానికి తనకు సూటయ్యే మంచి కథ దొరకితే చూద్దాం, సమయం అనుకూలిస్తే చేద్దాం అని కహానీలు చెబుతూ నెట్టుకొస్తున్నారు చిరంజీవి. ఇటీవల ఆయన బెంగుళూరులో తన 150వ సినిమా గురించి మాట్లాడుతూ... చక్కని సందేశంతో కూడిన సామాజిక విలువలున్న కథ దొరికితే నటించడానికి నేను సిద్దమే అని, సోనియా గాంధీ అనుమతితో 150వ సినిమా చేస్తానని తెలిపారు.


Click it and Unblock the Notifications












