Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లారా దత్తా-మహేష్ భూపతి కూతురు(ఫస్ట్ లుక్)
ముంబై : బాలీవుడ్ స్టార్ లారా దత్త- టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి గత గత సంవత్సరం ప్రేమ వివాహం చేసుకోవడం, లారా దత్తా గర్భం దాల్చడం, జనవరి 20, 2012న ఈ దంపతులు ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ ముద్దుల కూతురికి సైరా అనే నామకరణం చేసారు. ఇప్పటి వరకు సైరా మీడియాకు కనిపించలేదు. తాజాగా ఈ దంపతులు సైరాతో కలిసి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు కెమెరా చిక్కారు.
ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ సీఈవో కిషోర్ లుల్లా కూతురు రిషికా లుల్లా పెళ్లికి హాజరైనప్పుడు ఈ దంపతులు జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చారు. కూతురు పుట్టిన తర్వాత లారా దత్తా మోడలింగ్, సినిమాలకు దాదాపుగా దూరమైంది. పూర్తిగా సైరా ఆలనాపాలనతోనే గడుపుతోంది.
లారా దత్తా చివరగా షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'డాన్ 2' చిత్రంలో నటించింది. ఈచిత్రంలో ఆయేషా పాత్రలో నటించిన లారా దత్తా ఇందులో డాన్ పాత్ర పోషించిన షారుక్ కు సహాయ పడే పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె విక్రమ్ హీరోగా బిజోయ్ నంబియార్ దర్వకత్వంలో రూపొందబోయే 'డేవిడ్' చిత్రంలో ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం ఇంకా ప్రీప్రొడక్షన్ దశలోనే ఉంది.