కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద ‘రుద్రమదేవి’ సెట్ (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రం షూటింగ్ నేటి నుంచి అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం వద్ద జరుగుంది. ఈ మేరకు యూనిట్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 రోజుల పాటు ఇక్కడ జరిగే షూటింగులో అనుష్క, రాణాలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొననున్నట్లు మేనేజర్ బాలరాజు తెలిపారు.

ఇక్కడ షూటింగ్ నిమిత్తం ప్రత్యేకంగా సెట్లు వేసారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన వీరనారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మార్చి నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X