సమంతకు సీక్రెట్ ఎంగేజ్మెంట్? (ఈ ఫోటోనే సాక్ష్యం!)
హైదరాబాద్: హీరోయిన్ సమంత, హీరో సిద్ధార్థ మధ్య ల ఎఫైర్ ఉన్నట్లు గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మాత్రం వారు ఒప్పుకోవడం లేదు. కానీ ఆ మధ్య ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ....'ఒక వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నాను, మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. త్వరలోనే అతను ఎవరో చెబుతాను' అనే వెల్లడించింది.
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సమంతకు సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలకు కారణమైంది. ఇటీవల ఓ హాస్పటల్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సమంత చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనపడటమే ఇందుకు నిదర్శనం. ఇపుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఆ మధ్య సమంత-సిద్ధార్థ లవ్ ఎఫైర్ వార్తలు వెలుగులోకి వచ్చిన కొన్ని రోజులకే....ఇద్దరూ శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహిస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరి మధ్య నిజంగానే ఏదో సంబంధం ఉందనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే అలాంటి దేమీ లేదని అప్పట్లో ఈ వార్తలను వారు ఖండించారు.
మరి సమంత కావాలనే సిద్దార్థతో సంబంధాన్ని రహస్యంగా ఉంచుతోందా? విషయం బయట పడితే తన సినిమా కెరీర్ దెబ్బతింటుందనే ఇలా చేస్తోందా? లేదా......సమంత మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతున్న వ్యక్తి వేరే ఎవరైనా ఉన్నారా? ఈ సందేహాలకు కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











