దృశ్యాలు : జియా ఖాన్ అంత్యక్రియల్లో సెలబ్రిటీలు
ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ అంత్యక్రియల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని తుది వీడ్కోలు పలికారు. జియా ఖాన్ సోమవారం ముంబై జుహులోని తన ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం ముంబైలో ముస్లిం సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు రితేష్ దేశ్ ముఖ్, కిరణ్ రావు, సిద్ధార్థ మాల్యా, సోఫీ చౌదరి, ఊర్వశి థోలకియా, రంజీత్, దీపక్ పరాశర్, ప్రేమ్ చోప్రా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై జియాఖాన్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. జియా ఖాన్ ప్రియుడిగా చెప్పబడుతున్న సూరజ్ పంచోలి, అతని తండ్రి ఆదిత్య పంచోలి, తల్లి జరీనా వాహెబ్‌లతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.
జియా ఖాన్ కేసును విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్లు చెప్పిన మరో విషయం ఏమిటంటే...8 నెలల క్రితం కూడా జియా ఖాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, తాగిన మైకంలో మనికట్టుపై కోసుకుందని తెలిపారు. అంతే కాకుండా...ఆమె బెడ్ రూంలో ఆయుర్వేదిక్ నిద్రమాత్రలు కూడా లభించాయని వెల్లడించారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'నిశ్శబ్ద్' ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జియా ఖాన్ ఈ చిత్రంలో అమితాబ్‌కు జోడీగా నటించింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ మూవీ గజినిలో ముఖ్య పాత్రలో నటించింది. ఆమె నటించిన చివరి సినిమా సాజిద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన 'హౌస్ ఫుల్'.

జియా ఖాన్ అంత్య క్రియలు బుధవారం ముంబైలో జరిగాయి. అంతిమయాత్రలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

జియా ఖాన్ అంత్యక్రియలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నటుడు రితేష్ దేశ్ ముఖ్ కూడా వచ్చి అంతిమ వీడ్కోలు పలికాడు.

వ్యాపార వేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా కూడా జియా ఖాన్ అంత్యక్రియల్లో కనిపించాడు.

బిగ్ బాస్ విన్నర్ ఊర్వశి ధోలకియా కూడా జియాఖాన్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

జియా ఖాన్ అంత్యక్రియల్లో అమీర్ భార్య కిరణ్ రావు పాల్గొన్నారు. జియా ఖాన్ అమీర్ నటించిన ‘గజిని' చిత్రంలో నటించింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రా కూడా జియా ఖాన్ అంత్యక్రియలకు హాజరయ్యాడు.

ప్రముఖ బాలీవుడ్ విలన్ పాత్రధారి రంజీత్ తన భార్యతో కలిసి జియా ఖాన్ అంత్యక్రియలకు హాజరయ్యాడు.

నిన్నటి తరం నటుడు సంజయ్ ఖాన్ జియా ఖాన్ అంత్యక్రియలకు హాజరయ్యాడు.

అంత్యక్రియల్లో దుఖ:సాగరంలో మునిగిన జియా ఖాన్ తల్లి రబియా అమిన్, సోదరి


Click it and Unblock the Notifications











