సెక్సీ అని చూస్తే...భయపెట్టి చంపేస్తుంది (ఫోటోలు)
ముంబై : బాలీవుడ్ సెక్సీ బ్యూటీల్లో బిపాసా బసు ఒకరు. వెండి తెరపై శృంగార రసాన్ని పండించడంలో బిపాసా రూపే సెపరేటు. తనకు సెక్సీగా మత్తెక్కించడమే కాదు, గుండెలు అదిరిపోయేలా భయపెట్టడమూ తెలుసు అని అంటోంది ఈ బ్యూటీ. ఇటీవల రాజ్ 3డి అనే హారర్ ఫిల్మ్ చిత్రంలో నటించిన బిపాసా...తాజాగా 'ఆత్మ' అనే మరో దెయ్యం సినిమాలో నటిస్తోంది.
బిపాసా బసు, నవాజుద్దీన్ సిద్ధిఖి జంటగా రూపొందుతున్న 'ఆత్మ' చిత్రానికి సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 22న ఈచిత్రం విడుదల కాబోతోంది. అంతే కాదు ఈచిత్రానికి సీక్వెల్‌గా 'ఆత్మ 2' చిత్రం కూడా రూపొందిస్తామని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్ రిలీజ్ అయింది. ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసారు. కార్యక్రమంలో బిపాసా, నవాజుద్దీన్ సిద్ధిఖితో పాటు 'ఆత్మ' మూవీ టీం మొత్తం పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోపై ఓ లుక్కేద్దాం.

‘ఆత్మ' ఫస్ట్ లుక్ పోస్టర్

‘ఆత్మ' మూవీ టీం సభ్యులతో బిపాసా బసు

‘ఆత్మ' ఫస్ట్ లక్ లాంచ్ కార్యక్రమంలో నవాజుద్దీన్

చైల్డ్ ఆర్టిస్టుతో బిపాసా బసు

‘ఆత్మ' ఫస్ట్ లక్ లాంచ్ కార్యక్రమంలో బిపాసా


Click it and Unblock the Notifications











