నీతూ చంద్ర.. వేడి వేడి 'బిర్యాని'( హాట్ ఫోటోలు)
హైదరాబాద్ : తమిళ స్టార్ హీరో కార్తీ 'బిర్యానీ' వండటానికి దినుసుల్ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే స్పైసీగా నోరూరించే బిర్యానీని ఆయన తయారు చేయబోతున్నారు. అందులో ప్రధాన దినుసుగా నీతూ చంద్రని తీసుకున్నారు. వెంకట్‌ప్రభు దర్శకుడు. అజిత్‌తో 'గాంబ్లర్' లాంటి సంచలన విజయం తర్వాత వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించబోయే సినిమా ఇదే కావడం విశేషం.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింస్తున్నారు. స్కిన్ షోతో, ఎక్స్ ఫోజింగ్‌తో ప్రేక్షకుల చూపులు తనవైపు తిప్పుకునే నీతూ చంద్ర ఈ చిత్రం టైటిల్ కి తగ్గట్లే ఈ చిత్రంలో అందాల బిర్యానీ అందిస్తుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

తెలుగులో తొలిసారిగా నీతూ చంద్ర .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'గోదావరి' చిత్రంలో చేసింది. అందులో సుమంత్ కి మరదలగా కనిపించింది.

రాజశేఖర్ సరసన నటించిన ‘సత్యమేవ జయతే'వివాదాలు అయితే తెచ్చిపెట్టగలగింది కానీ...కలెక్షన్స్ కురిపంచిలేకపోయింది. అయితే తమిళంలో విశాల్ సరసన చేసిన ‘కిలాడీ'మాత్రం గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చి పెట్టింది.

మాధవన్ సరసన 13బి చిత్రం చేసింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ తమిళంలో నూ ప్రవేశించింది. అక్కడ తమిళ తంబీలను సైతం ఆకట్టుకుంది.

బిర్యానీ ఓకే చేసేటప్పటికి ఆమె తమిళంలో చేసినవి నాలుగు సినిమాలే కానీ అక్కడ మంచి క్రేజ్ వచ్చింది.

"యుద్ధం సే" అనే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి అదరకొట్టింది.

నీతూ చంద్ర నెక్ట్స్ తమిళ చిత్రం ఆది భగవాన్. సంక్రాంతికి విడుదల అయ్యే ఈ చిత్రం తెలుగులోనూ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది ఈ హాట్ బ్యూటీ. ఇంగ్లీష్, గ్రీక్ చిత్రంలో రూపొందుతున్న ఆ సినిమా పేరు ‘హోం స్వీట్ హోం'.


Click it and Unblock the Notifications











