మహి రేసింగ్ టీంతో నాగ్, అఖిల్, అమల సెలబ్రేషన్స్ (ఫోటోలు)
స్పెయిన్: టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రికెటర్ ధోనీకి సంబంధించిన మహి రేసింగ్ టీం యాజమాన్యంలో భాగస్తుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ టీం ప్రస్తుతం స్పోయిన్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. దీంతో ఆ టీంతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు నాగ్. ఆయనతో పాటు తనయుడు అఖిల్, భార్య అమల కూడా ఉన్నారు.
ఆయన ఆదివారం ఇక్కడ మీడిమాతో మాట్లాడుతూ... 'మా టీం విజయం సాధించడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. మా రైడర్స్‌లో ఎంతో సత్తా ఉంది. వారి పెర్ఫార్మెన్స్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాం' అని వెల్లడించారు. ఈ రేసింగ్ ముగిసే వరకు నాగార్జున అండ్ ఫ్యామిలీ స్పెయిన్లోనే ఉండనున్నారు.
ఓ మధ్యవర్తిద్వారా ధోనీకి, నాగార్జునకు లింకు కలిసింది. దీంతో ఇద్దరూ వ్యాపార భాగస్వాములు అయ్యారు. బైక్‌లంటే వల్లమాలిన వ్యామోహం కనబర్చే టీమిండియా కెప్టెన్ ధోనీ, రేసింగులంటే పడిచచ్చే సినీ నటుడు నాగార్జున ఇప్పుడు సంయుక్తంగా రేసింగ్ రంగంలోకికి దిగారు.

మహి రేసింగ్ టీం సభ్యులతో నాగార్జున, అఖిల్.

రేసింగ్ వీక్షిస్తున్న నాగార్జున అమల.

బైక్ రేసింగ్ రైడర్‌తో కలిటీ నాగార్జున, అఖిల్.

నాగార్జున.

రేస్ బైక్ తో నాగార్జున.


Click it and Unblock the Notifications











