హీరో నాని వివాహం(ఫోటో లు)
హైదరాబాద్ : సినీ హీరో నాని వివాహం శనివారం రాత్రి విశాఖలో ఘనంగా జరిగింది. రుషికొండ ప్రాంతంలోని న్యూనెట్ టెక్నాలజీ ఐటీ సంస్థ ప్రాంగణంలో నగరానికి చెందిన వ్యాపారవేత్త యలపర్తి రతీష్ కుమా ర్తె అంజనను నాని పరిణయమాడారు. వివాహానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, దర్శకుడు కృష్ణవంశీ, నటులు తరుణ్, దగ్గుబాటి రాణా, భీమిలి కబడ్డీ జట్టు చిత్రయూనిట్ సభ్యులు హాజరయ్యారు. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మంటపంలో నాని పెళ్లి కనులపండువగా జరిగింది.

ఈగ చిత్రంతో జాతీయ స్ధాయిలో తానేంటో ప్రూవ్ చేసుకున్న నాని, తన ఫియాన్సి అంజన ని హిందు వివాహ సంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. అంజన వైజాగ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

నాని, అంజనల వివాహం వైజాగ్ రిషికొండ రిసార్ట్ లో ఘనంగా అక్టోబర్ 27,2012 న జరిగింది.

నాని, అంజనల వివాహం కేవలం ఓ ప్రెవేట్ పంక్షన్ గానే జరుపుకున్నారు. తమ శ్రేయాభిలాషులు,ఆత్మీయులు,ఇరు పక్షాలు కుటుంబాలు మాత్రమే హాజరయ్యారు.

తమ కోలిగ్స్ కు, మిగిలిన సినిమా వారికీ, తన అబిమానులకు హైదరాబాద్ లో ఘనంగా రిస్పెషన్ నాని ఎరేంజ్ చేయనున్నారు.

అగస్టు 12 న నాని వివాహం తొలి సారి ప్రపంచానికి తెలిసింది. ఆ రోజునే వైజాగ్ లో ఓ ప్రెవేట్ పంక్షన్ లో నాని ఎంగేజ్ మెంట్ జరిగింది.
కొంత కాలంగా నాని, అంజన ప్రేమించుకుంటున్నారు. ఫేస్ బుక్ ద్వారా వీరి పరిచయం ఏర్పడిందని మీడియాలో వచ్చింది. కానీ నాని దాన్ని తర్వాత ఖండించారు. ఆగస్ట్ 12వ తేదీన వీరికి వైజాగ్ లో నిశ్చితార్థం జరిగింది. మొన్న శనివారం రాత్రి 10.30 గంటలకు వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ పరిశ్రమ నుంచి తరుణ్, తదితరులు హాజరయ్యారు. ధట్స్ తెలుగు ఈ నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











