ఓకే సినిమా...ముగ్గురితో సమంత లిప్‌లాక్!(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : హీరోయిన్ సమంత ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా వేర్వేరుగా చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. ఈ మూడు చిత్రాల్లో హీరోయిన్ సమంతనే అయినా...హీరోలు మాత్రం వేరు.

ఈ ఫోటోలో నాని, సమంత ఫోజ్ లిప్ లాక్ రూమర్ కు కారణమైంది.

ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రంలో నాని పాత్ర పేరు వరుణ్, సమంత పాత్ర పేరు నిత్య. స్కూల్ డేస్ నుంచి ఇద్దరు లవర్స్.

ముఖ్యంగా యూత్ టార్గెట్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పటికే ఈగ చిత్రంలో నాని, సమంత మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రంలో కూడా ఈ జంటకు మంచి పేరొస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఇళయరాజా అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఆ పాటలు మరింత ప్లస్ కానున్నాయి.
తెలుగులో హీరో నాని, తమిళంలో హీరో జీవా, హిందీలో ఆదిత్య రాయ్ కపూర్ లు నటిస్తున్నారు. తాజాగా తెలుగుకు సంబంధించి నాని-సమంత మధ్య లిప్ లాక్ సీన్ ఉన్నట్లు ఓ ఫోటో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా మిగతా రెండు భాషల్లోనూ, ఆయా హీరోలతో సమంత లిప్ లాక్ సన్నివేశం చేసి ఉంటుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అదే జరిగితే సమంతను కిస్సుల క్వీన్ గా పిలవడం ఖాయం. ఇప్పటికే సమంత ఏ మాయ చేసావె చిత్రంలో నాగ చైతన్యతో లిప్ లాక్ సీన్ చేసిన విషయం తెలిసిందే.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈచిత్రం డిసెంబర్ 14న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమ కథా చిత్రాలు తీయడంలో దర్శకుడు గౌతం మీనన్ తనదైన శైలిని అనుసరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు అటు ఎంటర్ టైన్మెంట్ తో పాటు... హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి కాబట్టే ఆయన సినిమాలంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడటానికి కారణం అయింది. 'ఎటో వెళ్లి పోయింది' మనసు చిత్రంలో 22 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఈ పార్ట్ ప్రేక్షకులను ఎమోషనల్ గా అరెస్టు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











