నాని, వాణి కపూర్‌పై లిప్‌లాక్ సీన్ల చిత్రీకరణ ఇలా.. (ఫోటోలు)
హైదరాబాద్: నాని, వాణి కపూర్ జంటగా తెలుగు, తమిళంతో తెరకెక్కిన చిత్రం 'ఆహా కళ్యాణం'. హిందీలో హిట్టయిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్‌గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈచిత్రాన్ని నిర్మించింది. ఈ సంస్థ సౌత్ నిర్మించిన తొలి సినిమా ఇదే. ఇటీవల విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రంలో నాని, వాణి కపూర్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. అందుకు సంబంధించిన సీన్లు ఎలా చిత్రీకరించారు అనే అంశానికి సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ మీకు చూపెట్టబోతున్నాం. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు....

ఆహా కళ్యాణంలో నాని, వాణి మధ్య లిప్ లాక్ సీన్
నాని, వాణి కపూర్ లపై తాజాగా విడుదలైన ‘ఆహా కళ్యాణం' చిత్రంలో లిప్ లాక్ సీన్ ఉంది. ఆ సీన్ చిత్రీకరణకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్ ఇక్కడ చూడొచ్చు.

నాని భార్య ఎలా ఫీలైంది?
పెళ్లైన సినిమా హీరోలు తొలిసారి ఆన్ స్క్రీన్‌పై లిప్ లాక్ సీన్లు చేయాలంటే భయపడతారు. భార్యలు అభ్యంతరం చెబుతారని వెనకాముందు ఆలోచిస్తారు.

నాని భార్య అంగీకారం
ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ చేసే ముందు హీరో నాని తన భార్య అనుమతి తీసుకున్నాడట. సినిమాల ట్రెండు మారింది, ఇపుడు ఇవన్నీ కామనే కాబట్టి ఆమె ఈ లిప్ లాక్ సీన్ విషయాన్ని లైట్ తీసుకుందట.

అదేమీ వల్గర్ సీన్ కాదు
ఆహా కళ్యాణం చిత్రంలో నాని, వాణి మధ్య ఉన్న లిప్ లాక్ సీన్ చాలా డీసెంటుగా ఉంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఈ సీన్ ప్లాన్ చేసారు. ఒకే ఒక షాట్‌లో ఈ సీన్ కంప్లీట్ చేసారట.

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా
ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా సింపుల్‌గా, చూడ ముచ్చటగా ఈ లిప్ లాక్ సీన్ చిత్రీకరించారు.

వాణి కపూర్ ఏమంది?
వాణి కపూర్ కూడా నానితో లిప్ లాక్ సీన్ చేయడాన్ని పెద్ద ఇష్యూ ఏమీ చేయలేదు. స్క్రిప్టు డిమాండ్ మేరకు ఇలాంటి సీన్లు చేయడానికి తాను సిద్దమే అని వాణి కపూర్ గతంలోనే ప్రకటించింది.

నాని-వాణి కెమిస్ట్రీ
సినిమాలో నాని, వాణి కపూర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమాకు ఇది హైలెట్ అయింది.


Click it and Unblock the Notifications











