సెక్సీ పాత్రలకు నయనతార గుడ్‌బై

By Pratap

హైదరాబాద్: తిరుగులేని దక్షిణాది హీరోయిన్లలో నయనతార ఒకరు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో ఆమెకు ఎనలేని క్రేజ్ ఉంది. ఆమెకు వివిధ భాషా చిత్రాల్లో ఆమెకు ఆఫర్లు ముంచుకొస్తున్నాయి. అయితే, పాత్రల ఎంపికలో ఆమె జాగ్రత్తలు తీసుకుంటోంది. సెక్సీ పాత్రలకు, గ్లామర్ రోల్స్‌కు స్వస్తి చెప్పాలని నయనతార అనుకుంటోంది.

విశాల్‌తో నయనతార

విశాల్‌తో నయనతార

తొమ్మిదేళ్లుగా సినిమాల్లో నటిస్తున్న నయనతార నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానని ఓ ప్రముఖ పత్రికతో చెప్పింది.

బిల్లాలో నయనతార

బిల్లాలో నయనతార

స్త్రీల అందచందాలను మాత్రమే చూపే సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె అనుకుంటోంది. నటనకు అవకాశం ఉన్న కమర్షియల్ చిత్రాలను ఎంపిక చేసుకోవాలని అనుకుంటోంది.

కుచేలన్‌లో నయనతార

కుచేలన్‌లో నయనతార

రజనీకాంత్‌తో కుచేలన్ సినిమాలో నయనతార ఆడిపాడింది. ఆ తర్వాత శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య సరసన సీత పాత్రలో నటించిన తర్వాత నయనతార చాలా మారిపోయింది.

సత్యంలో నయన్

సత్యంలో నయన్

ద డర్టీ పిక్చర్ తమిళ వెర్షన్‌లో నటించడానికి నయన్ నిరాకరించింది. అందులో నటిస్తే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ అంగీకరించలేదట. అంగాంగ ప్రదర్శన చేయడం ఇష్డం లేకనే ఆ సినిమాను తోసిపుచ్చినట్లు సమాచారం.

శ్రీరామరాజ్యంలో నయనతార

శ్రీరామరాజ్యంలో నయనతార

మరోసారి సీత పాత్ర పోషించాలని నయన్ ఆశిస్తోందట. మరిన్ని పౌరాణిక పాత్రల్లో కూడా నటించాలనేది ఆమె ఆశ.

తాను హీరోలతో శృంగార దృశ్యాలను చేయబోనని, గ్లామర్ రోల్స్‌కు కూడా దూరంగా ఉంటానని తన వద్దకు వస్తున్న నిర్మాతలతో నయనతార చెబుతోందట. తన నటనా కౌశలాన్ని వెలికి తీసే పాత్రల్లో మాత్రమే ఆమె నటించాలనే నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ప్రభు దేవాను పెళ్లి చేసుకుంటానని చెప్పి సినిమాల నుంచే తప్పుకోవాలని అప్పట్లో ఆమె నిర్ణయం తీసుకుంది. అయితే, ఇరువురి మధ్య ప్రేమాయణం బెడిసి కొట్టడంతో తిరిగి సినిమాల్లో నటిస్తోంది. తెలుగు సినిమా కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఆమె నటిస్తోంది. నాగార్జన సరసన ఓ ప్రేమ కథలో నటిస్తోంది. అజిత్ కుమార్‌తో పేరు పెట్టని ఓ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఆర్యతో మురుగదాస్ దర్శకత్వంలో రాజా రాణి చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Read more about: nayantara నయనతార
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X