పిచ్చెక్కించేలా నయనతార ఒంపుసొంపులతో...(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: 'కృష్ణం వందే జగద్గురుమ్'లో కనపించిన నయనతార త్వరలో మాస్ కి ఓ మసాలా ట్రీట్ ఇవ్వనుంది. ధనుష్ తో ఆమె తమిళంలో చేస్తున్న స్పెషల్ సాంగ్ లో ఆమె ఒంపుసొంపులు ఓ రేంజిలో ఎక్సపోజ్ చేసిందని చెన్నై సమాచారం. ధనుష్ సైతం ఆమెకు పోటీ ఇస్తూ ఓ రేంజిలో రెచ్చిపోయాడంటున్నారు.
తమిళ హీరో ధనుష్ నిర్మిస్తున్న చిత్రంలో ఆమె ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతోనే చిత్రానికి క్రేజ్ వచ్చింది. శివకార్తికేయన్, ప్రియాఆనంద్ జంటగా ధనుష్ 'ఎదిర్ నీచ్చల్' పేరుతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ కానుంది.
ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున సరసన చేస్తున్న లవ్ స్టోరీ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కృష్ణం వందే జగద్గురం చిత్రంలో ఆమె చేసిన జర్నలిస్టు పాత్రకు మంచి అప్లాజ్ రావటంతో తెలుగులో మళ్లీ ఆమె హవా మెదలయ్యేటట్లు కనపడుతోంది. అలాగే ఆమె చేసే ఐటం సాంగ్ హిట్టైతే తెలుగులోనూ పెద్ద నిర్మాణ సంస్ధలు ఆమెను తమ చిత్రాల్లో ఐటం సాంగ్స్ కు అడగాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

నయనతార ఐటం సాంగ్ కి ఒప్పుకోవటమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అంతకుముందు ఆమెను సూర్య చిత్రం సింగమ్ 2 లో ఐటం సాంగ్ కి అడిగితే నో చెప్పింది.

తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో క్రేజ్ రావడానికి నయనతారను ఒప్పించే భాధ్యత తీసుకున్నాడు ధనుష్. ధనుష్ అడిగాడు కాబట్టే ఆమె కూడా ఓకే చేసిందంటున్నారు. అలాగే ఆ పాటలో తను కూడా కనిపిస్తాడు. నయనతార,తను డాన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నాడు.

నయనతార ప్రస్తుతం అజిత్ సరనస చేస్తూ బిజీగా ఉంది. పంజా దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతోంది.

తెలుగులో నాగార్జున సరసన దశరధ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లవ్ స్టోరీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

శ్రీరామరాజ్యంలో తన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా సీతా దేవిగా చేసింది. దాంతో ఇప్పుడామె పూర్తిగా తన మళ్లీ తన పాత ఇమేజ్ కి ట్రాన్సఫర్ అయ్యే కార్యక్రమంలో బిజీగా ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











