twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ‘జన సేన’ పార్టీ లోగో, ఫ్లాగ్ ఇదే (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించబోతున్న 'జన సేన' పార్టీకి రంగం సిద్ధమైంది. తాజాగా పార్టీకి సంబంధించిన లోగో, జెండాను కూడా విడుదల చేసారు. విప్లవానికి గుర్తయిన ఎరుపు రంగుతో, శాంతికి గుర్తయిన తెలుపు రంగు కలయికతో కూడిన ఈ జెండా మధ్యలో ఆరు కోణాలు కలిగిన స్టార్ కలిగి ఉంది.

    వైట్ బ్యాగ్రౌండ్: తెలుపు అంటే శాంతికి చిహ్నం. వేలాది సంవత్సరాలుగా భారత దేశంలో నెలకొన్న శాంతి, స్థిరత్వాన్ని ఈ రంగు ప్రతిభింబిస్తుందని, అందుకే ఈ రంగును బ్యాగ్రౌండ్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

     Pictures: Pawan Kalyan Launches Jana Sena Party Logo, Flag

    ఎరుపు రంగు : లోగోతో పాటు, జెండాలో కొంత భాగం ఎరుపు రంగు కలిగి ఉంది. ఎరుపురంగు విప్లవానికి ప్రతీక. మార్పు రావాలంటే విప్లవ మార్గంలో ఈ పార్టీ ప్రయాణిస్తుందని స్పష్టమవుతోంది.

    ఆరు కోణాలు కలిగిన స్టార్ : ఆరు కోణాలు కలిగిన స్టార్ గుర్తును ఎంచుకోవడం ద్వారా పార్టీ ఆరు లక్ష్యాలతో ముందుకు సాగుతుందనడానికి గుర్తు.

    జెండా మధ్యలో చుక్క : జెండా మధ్యలో చుక్క ప్రతి జీవి ఆత్మకు ప్రతీక. ఆ ఆత్మ మన యొక్క నిజమైన రూపం, అంతిమ సత్యం.

    <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/myawP8bzqbI?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

    English summary
    The arrangements for the launch of Pawan Kalyan's new political party are currently going on at the brisk progress. On March 12, the Power Star's team had went live with an official fan page on Facebook. Today (Thursday), the team has revealed the party emblem and flag officially on its Facebook page. Besides posting the picture, Pawan Kalyan's commented, "INFORMATION ABOUT Jana Sena Party Emblem and Flag. The Party Emblem is a combination forces that define our nation's life and struggle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X