సైఫ్, కరీనా ఢిల్లీ రిసెప్షన్ (ఫోటోస్)
ముంబై : సైఫ్-కరీనా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా....రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా జరుపుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన రిసెప్షన్ వేడుకకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, బాలీవుడ్ సినీ స్టార్లు హాజరయ్యారు. ప్రధాని మన్మోహన్ వైఫ్ గురుశరణ్ కౌర్, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, రాజీవ్ శుక్లా, జ్యోతిరాధిత్య, సీపీఐ పార్టీకి చెందిన సీతారాం ఏచూరి, బిజేపీ నేత అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ ఆహ్లు వాలియా, రచయిత ప్రసూన్ జోషి, నందితా దాస్...ఇతర బాలీవుడ్ నటీనటులు హారయ్యారు. ఢిల్లీ ఔరంగాబాద్ రోడ్లోని గవర్నమెంట్ బంగ్లాలో రాత్రి 8 గంటలకు ఈ వేడుక ప్రారంభం అయింది.

సైప్ అలీఖాన్, కరీనా కపూర్ యొక్క వెడ్డింగ్ రిసెప్షన్ ఫంక్షన్ ఢిల్లీలోని ఔరంగబాద్ రోడ్ గవర్నమెంటు బంగ్లాలో శుక్రవారం జరిగింది.

రిసెప్షన్ వేడుకలో ‘హీరోయిన్' చిత్ర దర్శకుడు మాధుర్ బండార్కర్ ఫ్యామిలీ కరీనా.

రిసెప్షన్ వెన్యూ వద్దకు సైఫ్ అలీ ఖాన్ కార్లో వస్తున్న దృశ్యం.

రిసెప్షన్ వేడుకలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కత్రినా, కరీనాలతో డాన్స్ చేసాడు.

కరీనా కపూర్, తుషార్ కపూర్, మలైకా అరోరా కలిసి డాన్స్ చేస్తున్న దృశ్యం.

కరీనా కపూర్, కరిష్మా కపూర్ లతో రణబీర్ కపూర్

పటౌడీ ప్యాలెస్ నుంచి సైఫ్-కరీనా బయటకు వస్తున్న దృశ్యం.


Click it and Unblock the Notifications











