చిత్రాలు: సల్మాన్ ఖాన్, అతని శృంగార తారలు
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమాయణాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడో ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతున్న బాలీవుడ్ గుసగుసలాడుతూనే ఉంటుంది. ఆయనను బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అని పిలుస్తారు. వుమెన్ బీటర్ అని గిట్టనివాళ్లు అంటారు.

ఓ జోడీ గురించి మాటల్లో చెప్పలేం. మాటలు కూడా అనవసరమే. వారిద్దరు వెండితెరపైనే కాకుడా తెర బయట కూడా నాయికానాయకులే. మైనే ప్యార్ కియా క్యోయ్ కియా నుంచి ఏక్ థా టైగర్ వరకు ఇది హాట్ జోడీనే.

హమ్ ఆప్‌కే హై కౌన్ చిత్రంలో సల్మాన్ మాధురిని పడేయడానికి చూస్తున్న దృశ్యమే ఇది. సినిమాల్లో ఇంతకన్నా మంచి జోడీ ఉంటుందా అని అనిపించడం లేదా...

ప్రీతి జింటా, సల్మాన్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. సినిమా విజయానికి ఈ జోడీ ఉంటే చాలుననే సెంటిమెంట్ దాకా వెళ్లింది.

సల్మాన్ ఖాన్ - కరిష్మా కపూర్ అందాజ్ అప్నా అప్నా, దుల్హన్ లే జాయేంగే వంటి చిత్రాల్లో నటించారు. వీరిద్దరు క్యూట్ కపుల్‌గా సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు.

సల్మాన్ ఖాన్ - ఐశ్వర్యా రాయ్ వీర్దదిరి గతం మనకు అవసరం లేదు. వెండితెరపై శృంగారాన్ని ఆరబోసిన జంటగా మనకు గుర్తుండిపోతుంది.
దశాబ్దాలుగా సల్మాన్ ఖాన్ తన అభిమానులను ఆనందపరుస్తూనే ఉన్నాడు. లవర్ బాయ్, కమెడియన్, యాక్షన్ హీరో ఎలా పిలిచినా సల్లూ భాయ్ అనుకోడు, అన్ని పాత్రల్లో ఇమిడిపోతాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో విజయాలకు మారుపేరుగా నిలిచాడు. సినిమాల విజయాల్లో అతనితో నటించిన హీరోయిన్లకు కూడా పాత్ర ఉందనేది గుర్తించాల్సి ఉంటుంది.
వెండతెరపై సల్మాన్ ఖాన్ చాలా మంది హీరోయిన్లతోనే రోమాన్స్ నడిపాడు. అతనితో సినిమాల్లో నటించిన అందాల భామలను కొందరిని చూద్దాం. వెండితెరపై అతనితో కెమిస్ట్రీని పండించిన హీరోయిన్ ఎవరో మీరే గుర్తించవచ్చు.


Click it and Unblock the Notifications











