వైభవంగా హీరోయిన్ స్నేహ రిసెప్షన్
హీరోయిన్ స్నేహ, ప్రసన్నల వెడ్డింగ్ రిసెప్షన్, ఎంగేజ్ సెర్మనీ గురువారం చెన్నయ్ లో వైభవంగా జరిగింది. చెన్నయ్‌లోని శ్రీకావేరి కళ్యాణ మంటపంలో ఈ వేడుక జరిగింది. ప్రత్యేకమైన వస్త్ర ధారణలో స్నేహ, ప్రసన్నల ఈ చూడక్కని జంటగా కనువిందు చేశారు. తమిళుల సంప్రదాయం ప్రకారం రింగ్స్ మార్చుకున్నారు.
శుక్రవారం వీరి వివాహం జరుగనుంది. వివాహ వేడుకకు సినీ రంగంలోని అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. స్నేహ పెళ్లి కార్యక్రమం ప్రముఖ తమిళ టీవీ ఛానల్ విజయ్ టివిలో ఈనెల 20 టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు సదరు టీవీ ఛానల్ టెలికాస్ట్ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది.
'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి ద్వారా ఓ ఇంటివారు కాబోతున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకుంటున్నామని స్నేహ, ప్రసన్నలు తెలిపారు. పెండ్లి తర్వాత నటించే విషయమై స్నేహదే తుది నిర్ణయమని ప్రసన్న పేర్కొనగా, తానింకా దానిపై ఆలోచించలేదని స్నేహ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.


Click it and Unblock the Notifications












