»   »  శ్రీదేవి బర్త్ డే పార్టీ - సెలబ్రేటీలు హంగామా...(ఫోటోలు)

శ్రీదేవి బర్త్ డే పార్టీ - సెలబ్రేటీలు హంగామా...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి అందరి మనసులను దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తన 50 వ జన్మదినాన్ని ఘనంగా చేసుకుంది. ఈ పుట్టిన రోజుని పురస్కరించుకుని భర్త బోని కపూర్ ఇచ్చిన విందులో బాలీవుడ్ కళకళలాడింది. బోని కపూర్ ఏర్పాటు చేసిన విందుకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు, తారలు తరలివచ్చారు.

  విందుకు హాజరైన వారిలో బాలీవుడ్ తారలు శిల్పా శెట్టి, సుస్మితా సేన్, హేమా మాలిని, ఇషా డియోల్, జూహీ చావ్లాలతోపాటు దర్శకులు అబ్బాస్ మస్తాన్, బంటీవాలియా, రమేశ్ తరానీ, గిరిష్ తరానీ, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ సంతోషి, జయ్ మెహతా, రిషి కపూర్, మనోజ్ బాజ్ పేయ్, వినోద్ ఖన్నా, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ లు సంగీత దర్శకులు అను మాలిక్, బప్పిల హరి లుహాజరయ్యారు.


  తమిళనాడులో పుట్టిన ఆమె ఈ రోజు తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. 1975లో జూలీ సినిమాతో బాల నటిగా మనకు పరిచయం అయిన శ్రీదేవి ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా చిరంజీవి, నాగార్జునతో కూడా పలు సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు పొందింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఎన్నో సినిమాల్లో నటించిన బోని కపూర్ ను వివాహం చేసుకొన్న తరువాత సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవలే 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది.

  బర్తడే ఫంక్షన్ కి హాజరైన ప్రముఖులు..స్లైడ్ షోలో...

  శ్రీదేవి ఇలా స్టైలిష్ గా...

  శ్రీదేవి ఇలా స్టైలిష్ గా...

  శ్రీదేవి తన పుట్టిన రోజు పార్టీలో చాలా ఉషారుగా ఉంది. దానికి తగినట్లే ఆమె చాలా మోడ్రన్ గా స్టైలిష్ గాతయారై వచ్చింది. ఆమె కూతుళ్లకే ఆమె పోటి ఇచ్చిందని అందరూ మాట్లాడుకున్నారు. ఆమె పార్టీకి ఆమె సన్నిహితులు అంతా హాజరై విషెష్ తెలిపారు.

  తండ్రి, కూతురు

  తండ్రి, కూతురు

  తల్లి పుట్టిన రోజు వేడుకల్లో ఇలా కూతురు ముచ్చటగా తన తండ్రి బోని కపూర్ తో కలిసి ఫోజిచ్చింది. ఆయనకు తన చిన్న బిడ్డంటే ప్రాణం. ఆ విషయం ఎప్పుడూ చెప్తూంటారు. అలాగే ఆమె అల్లరి పిల్ల అని కితాబు ఇస్తూంటారు. ఆమె కూడా ఎప్పుడూ తన తండ్రిని విడిచిపెట్టదు.

  సుస్మితా సేన్

  సుస్మితా సేన్

  శ్రీదేవికు ఉన్న మంచి స్నేహితురాళ్లలో సుస్మితా సేన్ ఒకరు. ఆమె ఈ పంక్షన్ లో తన స్నేహితురాళ్లందరినీ కలుసుకున్నానని ఆనందంగా మీడియాకు చెప్పింది. శ్రీదేవి ఇంకా అందంగా ఈ వయస్సులోనూ మెరిసిపోతోందని కితాబు ఇచ్చింది.

  రితీష్, జెనీలియా

  రితీష్, జెనీలియా

  బాలీవుడ్ యువ జంటలలో ఒకరైన జెనీలియా,రితీష్ ఈ పంక్షన్ కు ప్రత్యేకార్షణగా నిలిచారు. జెనీలియా వెళ్లి కౌగలించుకుని శ్రీదేవికి విషెష్ తెలియచేసింది. రితీష్ తండ్రి కాలం నుంచి బోనీకి ఆ కుటుంబానికి మంచి సంభంధ భాంధవ్యాలు ఉన్నాయి.

  సోనాల్ చౌహాన్

  సోనాల్ చౌహాన్

  తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించిన సోనాలి చౌహాన్ ఈ పంక్షన్ కి హాజరై..శ్రీదేవి కి విషెష్ తెలియచేసింది. ఆ పంక్షన్ కి వెళ్లటం తన కెంతో ఆనందం కలిగించంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ పంక్షన్ పూర్తయ్యేదాకా ఆమె అక్కడే ఉంది.

  శిల్పాశెట్టి

  శిల్పాశెట్టి

  శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుందర్ తో కలిసి ఈ పంక్షన్ కి వచ్చింది. ఆమె శ్రీదేవి చిర కాల స్నేహితురాళ్లు. ఆమె తరుచుగా శ్రీదేవిని కలుస్తూనే ఉంటుంది. ఈ పంక్షన్ కి రావటంతో శ్రీదేవి దగ్గరుండి లోపలకి తీసుకు వచ్చింది.

  హేమమాలిని

  హేమమాలిని

  శ్రీదేవికి ఉన్న మంచి స్నేహితురాళ్లలో హేమ మాలిని ఒకరు. దాంతో హేమ మాలిని తన పనులు అన్నీ ప్రక్కన పెట్టి శ్రీదేవి పుట్టిన రోజు వేడుకలకు హాజరై విషెష్ తెలిపింది. ఇద్దరూ దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ కు దగ్గర వారు కావటంతో చాలా విషయాలు ముచ్చటించుకున్నారు.

  ఇషా డయోల్

  ఇషా డయోల్

  హేమ మాలిని కుమార్తె ఇషా డయోల్ ఇలా తన దైన శైలిలో డ్రస్ చేసుకుని వచ్చి పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మెరిసిపోయింది. ఆమె భర్తకూడా ఆమెతో పాటే ఉన్నారు. హేమ మాలిని కుమార్తె అయిన ఇషా ..ని శ్రీదేవి ప్రత్యేక ఆహ్వానితురాలిగా చెప్పింది.

  సుబ్బిరామి రెడ్డి

  సుబ్బిరామి రెడ్డి

  తెలుగు నుంచి వెళ్లిన ప్రత్యేక అతిధి సుబ్బిరామి రెడ్డి. సుబ్బిరామి రెడ్డికి బోని కపూర్ కి ప్రత్యేకమైన స్నేహ బంధం ఉంది. అలాగే శ్రీదేవిని సైతం ఆయన అభిమానిస్తారు. అందుకోసం ఆయన ముంబై వెళ్లి ఆమె పుట్టిన రోజు పంక్షన్ లో పాల్గొన్నారు. బోని కపూర్ దగ్గరుండి ఆయన్ని లోపలకి ఆహ్వానించారు.

  లారా దత్తా

  లారా దత్తా

  లారాదత్తా తన భర్త మహేష్ భూపతి తో కలిసి ఈ పంక్షన్ కి వచ్చింది. లారాదత్త తెలుగులో సైతం నటించింది. ఆమె గతంలో బోనీ కపూర్ నిర్మించిన సినిమాలు చేసింది. ఆ అనుబంధంతో ఆమె ఈ పంక్షన్ కి హాజరైంది.

  రాకేష్ రోషన్ ..

  రాకేష్ రోషన్ ..

  తోటి నిర్మాతగానే కాకుండా రాకేష్ రోషన్ కి, బోనీ కపూర్ కి మంచి స్నేహం ఎప్పటినుంచో ఉంది. దాంతో ఆయన భార్యతో కలిసి ఈ పంక్షన్ కి వచ్చారు. శ్రీదేవి ఎదురు వెల్లి ఆయన నుంచి విషెష్ స్వీకరించింది.

  రిషి కపూర్...

  రిషి కపూర్...

  తన సోదరుడు రణధీర్ కపూర్ తో కలిసి ..రిషి కపూర్ ఈ పార్టీలో కనిపించారు. ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. శ్రీదేవి ఈ సోదరిలిద్దరినీ ప్రత్యేకమైన ఆహ్వానం తో పిలిచి... విషెష్ తీసుకుంది.

  మెరిస్తూ శ్రీదేవి...

  మెరిస్తూ శ్రీదేవి...

  ప్రముఖనిర్మాత బోనీకపూర్‌ తో వివాహం అనంతరం శ్రీదేవి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే మొన్నామధ్య 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'తో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక శ్రీదేవికి జాహ్నవి, కుషి అని ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇప్పటికి చెక్కుచెదరని అందంతో కనిపించే శ్రీదేవి పుట్టిన రోజు పంక్షన్ లో ఇలా మెరిసిపోయింది.

  English summary
  
 The B-Town had a glittering get-together on Saturday night, August 17 as they celebrated the birthday bash of the beautiful actress Sridevi. This party held at Club Alibii, was enormous and filled with Bollywood's well known faces and some politicians too. This big party was organised by Sridevi's husband Boney Kapoor along with Member of Parliament Amar Singh. Sridevi turned 50 on August 13 this year and she had a quiet celebration with her family on her birthday. However, Boney and Amar Singh made this big bash a very special night for the lovely lady.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more