హాట్ హీరోయిన్లు...అమ్మతనం రుచి చూసిన వేళ(ఫోటోలు)
హైదరాబాద్ : ఒకప్పుడు వాళ్లంతా తమ అందం, అభినయంతో వెండి తెరను ఓ ఊపు ఊపి, ప్రేక్షకులను రంజింప చేసిన హీరోయిన్లు. వాళ్లకు ఆ కెరీర్ ఎంత సంతృప్తిని ఇచ్చిందనే విషయం పక్కన పెడితే....అమ్మతనంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదంటున్నారు. అమ్మగా మారిన తర్వాత కొందరు తమ కెరీర్‌కు గుడ్ బై చెబితే, మరికొందరు మాత్రం తల్లిగా తన బాధ్యతలను, ఇటు ఆర్టిస్టులగా తమ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మదర్స్ డే సందర్భంగా అలాంటి హీరోయిన్ల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.
సుస్మితాసేన్ : బాలీవుడ్ భామ సుస్మితాసేన్ స్వయంగా పిల్లలను కనకపోయినా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని అమ్మతనంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. వారి పేరు రినీ, అలీషా
ఐశ్వర్యరాయ్ : అందాల సుందరిగా ప్రపంచ వ్యాప్తంగా నిరాజనాలు అందుకున్న ఐశ్వర్యరాయ్ నవంబర్ 16, 2011న ఆరాధ్యకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లయిన తర్వాత పూర్తిగా ఆరాధ్య ఆలనా పాలనకే పరిమితమైన ఐశ్వర్య త్వరలో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటోంది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు

హీరోయిన్ శిల్పా శెట్టి మే 12, 2012న వియాన్‌కు జన్మనిచ్చింది. బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో శిల్పా ఒకరు.

ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత కాస్తలావెక్కిన ఐశ్వర్య, మళ్లీ సినిమాల్లోకి రావడానికి మరింత అందంగా తయారయ్యే పనిలో ఉంది.

అతిలోక సుందరి శ్రీదేవి జాన్వి, ఖుషిలకు జన్మినిచ్చిన తర్వాత పూర్తిగా వారి పెంపకానికే పరిమితం అయింది. అయితే ఇటీవల ‘ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.

సుస్మితాసేన్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఒకరి పేరు రేనీ, మరొకరి పేరు ఆలీషా

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సెలీనా జైట్ల మార్చి 2012లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారి పేర్లు విన్‌స్టన్, విరాజ్

2002లో అరవ్‌కు జన్మనిచ్చిన ట్వింకిల్ ఖన్నా, ఇటీవల మరో బేబీగర్ల్‌కు తల్లయింది.

గోల్ఫర్ జ్యోతి రంధ్వాను పెళ్లాడిన చిత్రాంగద సింగ్... జోరావర్ రంధ్వా కు జన్మనిచ్చింది.

బాలీవుడ్ బ్యూటీ జుహి చావ్లాకు అర్జున్ మెహతా, జాన్వి మెహతా అనే ఇద్దరు పిల్లలున్నారు.

కరిష్మా కపూర్ 2005లో సమీరాకు, 2010లో కియాన్ రాజ్‌కు జన్మనిచ్చింది.

కాజోల్-అజయ్ దేవగన్‌లకు ఇద్దరు సంతానం. ఒకరి పేరు న్యాసా, మరొకరి పేరు యుగ్

మాధురి దీక్షిత్‌కు ఇద్దరు మగపిల్లలు

మహేష్ భూపతిని పెళ్లాడిన లారా దత్తా ఇటీవల సైరాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

మలైకా అరోరా ఖాన్ కు పదేళ్ల వయసున్న బాబు ఉన్నాడు. అయినా ఆమె ఇప్పటికీ ఐటం గర్ల్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది.

హీరోయిన్ సోనాలి బింద్రే 2005లో తల్లయింది. ఆమె కొడుకు పేరు రన్వీర్


Click it and Unblock the Notifications











