టాలీవుడ్‌లో దిగిన కొత్త పాపలు వీరే.. (ఫోటోలు)
హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడూ కొత్త అందాల ప్రవేశిస్తుండం సర్వసాధారణం. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా పలువురు కొత్త హీరోయిన్లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పూజా హెడ్గే, రాగిణి ద్వివేది, కైనాజ్ మోతి వాలా, జాస్మిన్ బాసిన్, సుబ్రా అయ్య తదితరులు టాలీవుడు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
స్లైడ్ షోలో ఆయా హీరోయిన్లకు సంబంధించి ఫోటోలు, వారు నటిస్తున్న సినిమాల వివరాలు....

పూజా హెడ్గే
పూజా హెడ్గే త్వరలో నాగ చైతన్య సరసన ఓ సినిమాలో కనిపించబోతోంది. ఈ చిత్రానికి విజయ్‌కుమార్ కొండ దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా మెగాఫ్యామిలీ నుండి వస్తున్న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సరసన కూడా ఈ అమ్మడు నటించనుంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు.

రాగిణి ద్వివేది
నాని హీరోగా తెరకెక్కిన జెండాపై కపిరాజు చిత్రంలో రాగిణి ద్వివేది నటిస్తోంది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. బెంగుళూరుకు చెందిన ఈ భామ ఈ చిత్రంలో బబ్లీ విలేజ్ గర్ల్‌గా కనిపించనుంది.

కైనజ్ మోతీవాలా
గతంలో రాగిణి ఎంఎంఎస్ అనే హిందీ చిత్రంలో నటించిన హీరోయిన్ కైనజ్ మోతీవాలా తాజాగా శివాజీ హీరోగా రూపొందుతున్న ‘బూచోడమ్మ బూచోడు' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రేవన్ యాడు దర్శకత్వం వహిస్తున్నారు.

జాస్మిన్ బాసిన్
తమిళ వెర్షన్ ‘వేదం' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు త్వరలో ‘దిల్లున్నోడు' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

సుబ్రా అయ్యప్ప
బెంగుళూరుకు చెందిన మరో భామ సుబ్రా అయ్యప్ప. నారా రోహిత్ ప్రతినిధి చిత్రం ద్వారా ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తొలుతు ఈ భామ వైవిఎస్ చౌదరి ‘రేయ్' చిత్రంలో ఎంపికైంది కానీ తర్వాత ఈ సినిమా నుండి తప్పుకుంది.


Click it and Unblock the Notifications











