టాలీవుడ్ టాప్ ఐటం సాంగ్స్-2012(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్ : తెలుగు సినిమా అంటే...ఐటం సాంగు ఉండాల్సిందే. ఈ ట్రెండు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి పాపులర్ అయింది. ఐటం సాంగుల్లో అదరిపోయే స్టెప్పులేస్తూ అందాలు ఆరబోస్తూ ఐటం గర్ల్స్ హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ చూసేందుకు జనాలు ఎగబడే వారు. అయితే ఆ కాలంలో ఐటం సాంగులు అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు పెదవి విరిచే వారు. వాటిని అశ్లీల కేటగిరీ కింద లెక్కగట్టేవారు.

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్ చిత్రంలో ‘కెవ్వుకేక' సాంగ్ పవన్ కళ్యాణ్ అభిమానులతో కేక పెట్టింది. మలైకా అరోరా కంటే పవన్ కళ్యాణ్ స్టెప్పులే ఈ పాటుకు వన్నె తెచ్చాయి. ఐటం సాంగులు కంపోజ్ చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించాడు దేవిశ్రీ ప్రసాద్.

 కెమెరామెన్ గంగతో రాంబాబు

తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో ‘జరమొచ్చింది' సాంగ్ ప్రస్తుతం ఓ ఊపు ఊపుతోంది. సినిమాకు విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాస్తే... ఖుషి మురళి, శ్రావణ భార్గవి వాయిస్ అందించారు. పవన్ కళ్యాణ్ సరసన విదేశీ భామ స్కార్లెట్ విలన్స్ స్టెప్పులేయడం మరో ఆకర్షణ.

బిజినెస్ మేన్

మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మేన్ చిత్రంలో శ్వేతా భరద్వాజ్ చేసిన ‘బ్యాడ్ బాయ్స్' ఐటం సాంగ్ మంచి హిట్టయింది. తమన్ ట్రెండీ మ్యూజిక్, గీతా మాధురి, ప్రియా హిమేస్ వాయిస్, భాస్కర భట్ల లిరిక్స్ ఒకఎత్తయితే... శ్రేతా భరద్వాజ్ అందాల ఆరబోత ఈ సాంగుకు సెక్సీనెస్ తెచ్చిపెట్టింది.

కృష్ణం వందే జగద్గురుమ్


కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రాణా దగ్గుబాటి కలిసి సమీరా రెడ్డితో కలిసి ఐటం సాంగులో స్టెప్పులేయడం ఆకట్టుకుంది.

డమరుకం

ఇక డమరుకం చిత్రంలో నాగార్జున-చార్మిలపై ‘సక్కుబాయ్ గరమ్ చాయ్' సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

దేవుడు చేసిన మనుషులు

దేవుడు చేసిన మనుషులు చిత్రం ఫెయిలయినా...ఈ చిత్రంలోని ఆడియో మాత్రం హిట్టయింది. ముఖ్యంగా ‘డిస్టర్బ్ చేస్తున్నాడే' అంటూ సాగే ఐటం సాంగు రసికులను ఆకట్టుకుంది.

నా ఇష్టం

నా ఇష్టం చిత్రం ప్లాపయినా...ఈ చిత్రంలోని ‘జిలెలే జిలేలే' సాంగుకు మంచి మార్కులు పడ్డాయి.

రాను రాను ఐటం సాంగు తీరు మారడంతో పాటు ప్రేక్షకుల్లో ఆ లాంటి సాంగ్స్ పై అభిప్రాయం కూడా మారింది. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఐటం సాంగులను ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు కూడా కొన్ని సందర్భాల్లో ఐటం సాంగులు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి జనాలను ఉర్రూతలూగించే ఐటం సాంగ్స్ వచ్చాయి. గబ్బర్ సింగ్, నా ఇష్టం, దేవుడు చేసిన మనుషులు, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, జులాయి, కృష్ణం వందే జగద్గురుమ్, డమరుకం చిత్రాల ఐటం సాంగులు టాప్ ప్లేసును దక్కించుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X