హీరో ఉదయ్ కిరణ్ మ్యారేజ్ ఫోటోస్
అన్నవరం: చిత్రం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ఉదయ్ కిరణ్ వివాహం తన గర్ల్ ఫ్రెండ్ విషితతో ఈ నెల 24న అన్నవరం ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఉదయ్ ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.
గతంలో ఉదయ్ కిరణ్ కు చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అనుకోని కారణాలతో వీరి రిలేషన్ షిప్ పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత కొంత కాలం లైమ్ లైట్ లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత విషితతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల వారు వీరి విహానికి ఓకే చెప్పడంతో పెద్దల సమక్షంలో దంపతులయ్యారు.

ఉదయ్ కిరణ్-విషిత వివాహం ఈ నెల 24న రత్నగిరి హిల్స్ లోని అన్నవరం దేవాలయంలో జరిగింది.

ఉదయ్ కిరణ్-విషిత వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఉదయ్ కిరణ్ క్రీమ్ కలర్ దోతి ధరించగా, విషిత క్రీమ్ కలర్ సారీలో ఆభరణాలు అలంకరించుకుని వెలిగిపోయింది.

వివాహం అనంతరం ఇద్దరూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపించారు.

కొన్ని సంవత్సరాలుగా ఉదయ్ కిరణ్-విషిత మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది.

పెళ్లి తర్వాత డిఫరెంట్ గెటప్స్‌లో ఉదయ్-విషిత ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











