పిక్చర్స్: కండలవీరుడు దుస్తులు విప్పేసి..
ముంబై: సెక్సీ అపీల్‌కు హీరోయిన్లు మాత్రమే పరిమివతున్న తరుణంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో ట్రెండ్ మార్చేశాడు. అందం ఆడవాళ్ల సొంతం మాత్రమే కాదని, పురుషుల సొంతం కూడా అని నిరూపించాడు. పురుషులు కూడా సెక్సీగా కనిపిస్తారని చాటాడు. చొక్కా విప్పేసి తన దేహాన్ని అర్థనగ్నంగా ప్రదర్శించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు.
తెరపైనే కాదు, బయట కూడా చొక్కా విప్పేసి ఆనందించడం సల్మాన్ ఖాన్‌కు అలవాటు. మైనే ప్యార్ కియా సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పుడప్పుడే సల్మాన్ సినిమాల్లో అడుగు పెట్టాడు. చొక్కా విప్పేసి తన బాడీని ప్రదర్శించడానికి అతను ఏ మాత్రం సిగ్గుపడలేదు, బిడియపడలేదు, తిరస్కారం చూపలేదు. బాలీవుడ్‌లో డాషింగ్ హీరోగా అతను పేరు తెచ్చుకున్నాడు. గత 20 ఏళ్లుగా అతను సిక్స్ ప్యాక్‌ను కాపాడుకుంటూ వస్తున్నాడు.
చొక్కా విప్పేసి దేహం ఊర్థ్వభాగాన్ని ప్రదర్శించదడానికి సల్మాన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. సినిమాల్లో సల్మాన్‌ను అలా చూపించడానికి సినీ నిర్మాతలు, దర్శకులు ఉత్సాహం చూపిస్తారు. ఒకటో, రెండో అటువంటి దృశ్యాలు ఉండేలా చూసుకుంటారు. గత రెండు సినిమాలు ఏక్ థా టైగర్, దబాంగ్ 2ల్లో కూడా అలా కనిపించాడు అందాల సల్మాన్ ఖాన్.

మైనే ప్యార్ కియా చిత్రంలో సల్మాన్ ఖాన్ మొదటిసారి టాప్‌లెస్‌గా కనిపించాడు.

ప్యార్ కియాతో డర్నా క్యా చిత్రంలో ఒహో ఒహో జానే జనా పాటలో చొక్కా విప్పేసి కనిపించాడు. ఆ పాట మాస్‌ను ఉర్రూతలూగించింది.

గత 20 ఏళ్లుగా సల్లు సిక్స్ ప్యాక్‌ను మెంటైన్ చేస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ తన హాట్ బాడీతో ప్రేక్షకులను వెర్రెత్తిస్తున్నాడు.

బయట కూడా ఇలా చొక్కా విప్పేసి సల్మాన్ ఖాన్ కనిపించాడు.

కండలవీరుడు సల్మాన్ ఖాన్ అగ్గి కురిపిస్తూ సినిమాల్లో...


Click it and Unblock the Notifications











