twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇఫా 2013: వరస్ట్ అనిపించుకున్న మన సినీ జనం (ఫోటోలు)

    By Srikanya
    |

    ముంబై : తాజాగా మకావులో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఇఫా)- 2013 పురస్కారాల వేడుక ప్రపంచమంతా వీక్షించింది. ఈ వేడుకకు హాజరైన వారిందనీ,వారి డ్రెస్ సెన్స్ నుంచి వాకింక్ స్టైల్ దాకా అంతా గమనించారు. ఈ నేపధ్యంలో మన బాలీవుడ్ సెలబ్రేటీలు ఈ వేడుకకు వరస్ట్ డ్రెస్సులతో వచ్చారని కథనాలు వెలబడ్డాయి.

    వందేళ్ల భారతీయ సినిమా ఉత్సవాల్ని ఇదే వేదికపై నిర్వహించారు. షారుఖ్‌ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌, దీపికా పదుకొణెలు ఆడిపాడారు. ప్రభుదేవాతో కలిసి శ్రీదేవి చేసిన నృత్యం, మాధురీ దీక్షిత్‌ నృత్యభంగిమలు ప్రేక్షకుల్ని అలరించాయి. తారల నృత్య ప్రదర్శనల మధ్య ఆద్యంతం అట్టహాసంగా సాగింది వేడుక.

    ఇక వేడుకలో ...'బర్ఫీ' తన సత్తా చాటింది. ఉత్తమ చిత్రంగా నిలవడంతోపాటు మొత్తం 13 పురస్కారాల్ని సొంతం చేసుకొంది. ఈ చిత్రంలో నటించిన రణ్‌బీర్‌ కపూర్‌ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకొన్నారు. 'కహానీ' చిత్రంలో అభినయానికిగాను ఉత్తమ నటిగా విద్యాబాలన్‌ ఎంపికైంది.

    రణ్‌బీర్‌ ఈ వేడుకకు హాజరు కాలేదు. ఆయన తరఫున దర్శకుడు అనురాగ్‌ బసు పురస్కారాన్ని అందుకున్నారు. రణ్‌బీర్‌, విద్యాబాలన్‌ ఉత్తమ నటులుగా ఇఫా అవార్డుల్ని అందుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు 'రాక్‌స్టార్‌'లో నటనకుగానూ రణ్‌బీర్‌, 'ది డర్టీ పిక్చర్‌'లో నటనకుగానూ విద్య ఇఫా అవార్డుల్ని స్వీకరించడం విశేషం.

    'బర్ఫీ' తర్వాత 'అగ్నిపథ్‌, 'విక్కీ డోనర్‌', 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సీపూర్‌' చిత్రాలు అధికంగా పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి. డిజిటల్‌ హీరో ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని షారుఖ్‌ఖాన్‌కి అందజేశారు. 'విక్కీడోనర్‌' చిత్రానికిగానూ యామీ గౌతమ్‌, ఆయుష్మాన్‌ ఖురానా ఉత్తమ తొలి చిత్ర నటులుగా పురస్కారాల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, అనుష్క శర్మ, అక్షయ్‌ ఖన్నా, బోనీ కపూర్‌ హాజరయ్యారు.

    ఇక వరస్ట్ డ్రెస్ లతో వచ్చిన మన సెలబ్రెటీలు స్లైడ్ షో లో..

    విద్యాబాలన్


    విద్యాబాలన్..శారీల సెలక్షన్ లో టాప్ ఉంటుందని ఫ్యాన్స్ అందరికీ తెలుసు..అలాంటిది ఇలాంటి డ్రస్ లో వచ్చేసరికి ..అంతా నీరసపడిపోయారు.

    అభిషేక్ బచ్చన్

    ఈ డ్రస్ లో అభిషేక్ బచ్చన్ ని చూసేసరికి అందరికీ పింక్ సూట్ సెట్ కాదని తేలిపోయింది.

    గౌరవ్ ఖాన్

    ఇలాంటి అవార్డు ఫంక్షన్స్ ఎవరైనా ఇలాంటి అవుట్ పిట్ తో బోల్డ్ గా వస్తారా..అనేదే చర్చగా మారింది..

    అప్తాబ్ శివదాసని

    సూట్ కు తగ్గ టై లేకపోవటంతో చాలా విచిత్రంగా అంతా చూడటం జరిగింది. అంతా అతని గర్లెప్రెండ్ డ్రస్ కు మ్యాచింగ్ కోసం ఇలా చేసాడేమో అని జోక్ లు వేసుకున్నారు.

    నేహాధూపియా

    ఆ విచిత్రమైన హెయిర్ స్టైల్ చూసి జనం షాకయ్యారు. మొత్తం అందం మొత్తం ఇది నాశనం చేసేసింది అని టాక్. మరి ఫ్యాషన్ టిప్స్ ఏమన్నా తీసుకోవచ్చుగా..

    మినీషా లంబా

    సినిమాలు లేకే ఇలాంటి డ్రెస్ లలో కనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోందని అక్కడ గుసగుసలు..విన్నావా...

    షాహిద్ కపూర్

    నీ స్టైల్ సెన్స్ మొత్తం ఏమైపోయింది..ఇలాంటి ప్రింటెడ్ షర్ట్ వేసుకుని ఈ పంక్షన్ కు వచ్చేవేంటి డ్యూడ్

    కరిష్మా కొటక్

    అవుట్ ఫిట్ బాగుంది ..నీ ప్రెండ్స్ బర్తడే కి పనికివస్తుంది..కానీ ఇలాంటి ప్రెస్టేజియస్ ఈవెంట్స్ కాస్త మంచి డ్రస్ ఎంపిక చేసుకోవచ్చుకదా..

    లీసా హైడన్


    బాలీవుడ్ దేవతలా వెలగాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ ని సీనియర్స్ ని అడిగి తీసుకోవాల్సిన టైమ్ వచ్చింది..

    రిచా చద్దా

    నీ యాక్టింగ్ స్కిల్స్ చూసే మేం నేను ఫిదా అయ్యాం..అలాంటిది నీ డ్రెస్ సెన్స్ ఏమైంది..వాటీద్ దిస్

    English summary
    
 The 14th IIFA awards held at Macau on 6 July 2013 was a star studded event. And just like every year, this year too there were some worst dressed celebrities who attended the awards night. There were some Bollywood stars who did manage to impress us with their style, but many of them let us down. Click on the slider to view the worst dressed Bollywood celebrities at the the International Indian Film Academy Awards 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X