ట్రైలర్ పెద్ద హిట్... అంతటా చర్చ (వీడియో)

By Srikanya

హైదరాబాద్: బాలీవుడ్ కొత్త కథలను, ఆలోచనలను ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ, ఆహ్వానిస్తూ ముందుకు వెళ్తోంది. నిజ జీవితాలలోని విషాదానికి, ఫన్ ని జోడి చేసి హిట్ కొట్టే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అలాంటి చిత్రం ట్రైలర్ ఒకటి విడుదలై అందరిలో చర్చగా మారింది. అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆ ట్రైలర్ మరేదో కాదు. పీకూ సినిమాది. విక్కీ డోనర్, మద్రాస్ కేఫ్ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన సుజిత్ సర్కార్ పీకూ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ ట్రైలర్ ఇప్పటికే మీరు చూడకపోతే ఇక్కడ చూసేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నన్ను చేసుకోబోయేవాడు ఎవరైనా సరే మా నాన్నను కూడా చూసుకోవాలి అని దీపికా అంటూంటే...ఇర్ఫాన్...నేనేమన్నా పిచ్చోడనా అంటూనే ఆమె ను ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. పీకు(హీరోయిన్) తండ్రి డయాలసీస్ పేషెంట్. ఆయనకు సేవలు చేస్తూనే ఉద్యోగం చేస్తూంటుంది. అమితాబ్ మాత్రం ఇంటి చుట్టుప్రక్కల అందరితో గొడవలు పెట్టుకుంటూంటాడు. ఓ రోజు కొలిగ్ (ఇర్ఫాన్ ఖాన్) ...పీను ని అలా డిల్లీ నుంచి కలకత్తా దాకా తీసుకువెళ్ళటానికి ప్లాన్ చేస్తాడు. అయితే పీకు మాత్రం మా నాన్న లేకుండా రాను..రాలేను అని తేల్చి చెప్తుంది. అప్పుడు ఎలా ప్లాన్ చేసి తండ్రి,కూతుళ్లు ఇద్దరినీ తీసుకుని,ఆమెను ఇంప్రెస్ చేసే పోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసాడనేది కథ. ఇదో ఫ్యామిలీ డ్రామా.

అమితాబ్, దీపికా పీకూగా ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.తండ్రి-కూతురు అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఫ్యామిలీ డ్రామా కామెడీ ఎంటర్ టైనర్ లో దీపికా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. అమితాబ్, ఇర్ఫాన్ ఖాన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో బెంగాలీ యువతిగా నటిస్తున్న దీపికా పాత్ర సహజత్వం కోసం బెంగాలీ భాష నేర్చుకుంది.

తాను పోషించే పాత్రలో పరిపూర్ణత కోసం ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా వుంటానని చెబుతోంది బెంగళూరు సుందరి దీపికాపదుకునే. తాజాగా ఆమె పీకూ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తను బెంగాలీ యువతిగా కనిపిస్తానని, పాత్రలో సహజత్వం కోసం బెంగాలీ నేర్చుకుంటున్నానని చెప్పింది దీపికాపదుకునే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోల్‌కతాలో జరిగిందిది.

Piku Teaser: Hilarious yet thought-provoking 'Piku' trailer

దీపికా మాట్లాడుతూ చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నేను తమిళ యువతిగా నటించాను. రామ్‌లీలాలో గుజరాతీ మహిళగా, హ్యాపీ న్యూఇయర్‌లో మహారాష్ట్ర యువతిగా నటించాను. నాకు గుజరాతీ, మరాఠి భాషలపై కొంత పట్టుంది. అందుకే ఆ సినిమాల సమయంలో భాష నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా చేసినప్పుడు తమిళం నేర్చుకున్నాను. అదే విధంగా పీకూ చిత్రం కోసం బెంగాలీ నేర్చుకుంటున్నాను. కొత్త భాషను నేర్చుకోవడం సవాలులాంటిది. కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా స్థానిక బెంగాలీ వాళ్లతో మాట్లాడటం వల్ల త్వరగా భాషను నేర్చుకోవచ్చు. బెంగాలీ భాషలో పర్‌ఫెక్షన్ సాధిస్తాననే నమ్మకముంది అని చెప్పింది.

ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ కూడా పొడవాటి జుట్టు, పెద్ద పొట్టతో డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పీకూ సినిమాకు శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి మీడియాలో హల్ చల్ చేస్తూ వస్తున్న చిత్రయూనిట్.. ఇప్పుడు ఇంకాస్త జోరు పెంచి ప్రచారంలో దూసుకుపోతున్నారు.త్వరలోనే పీకూ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న డిటెక్టివ్ బోంకేష్ భక్షి సినిమా థియేటర్లలో ప్రదర్శించనున్నారట పీకూ మూవీ యూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X