అదేంటో గానీ గజనీ ప్రతీ అడుగులోనూ కోర్టు కేసులను ఎదుర్కుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలో హింస మోతాదు ఎక్కువైందంటూ ప్రజా ప్రయోజన వాజ్యం ఒకటి ముంబైలో నమోదైంది. ఆ సినిమాకు ఎ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందని ఆ పిటీషన్లో కోరారు.దానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారని దాని వలన పిల్లలు వెళ్ళే అవకాశం ఉందని దాన్నిA గా మార్చాలంటూ ప్రతిభ నైతాని కోరారు.నైతాని ముంబయి లోని సెయింట్ జేవియర్స్ కాలీజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆమె టీవీ ఛానెల్స్ లో అడల్ట్ మూవీస్ వేస్తున్నారని పిటీషన్ వేసి గెలిపొందారు. అలాగే అమీర్ ఖాన్ టట్టూలు చూసి అహ్మదాబాద్ లోని ఒ మూడు సంవత్సరాల బాలుడు రివెంజ్ అంటూ తన శరీరంపై టట్టూ వేయించుకున్నాడని,అది చూసి బాధతో ఈ వాజ్యం వేసానని మీడియాకు తెలిపారు.