RRRకు మరో షాక్.. అల్లూరి బ్రిటిష్ పోలీసా.. మహా దారుణం ఇది!
RRR విషయంలో కొత్త కొత్త టెన్షన్లు తెర మీదకు వస్తున్నాయి. సినిమా పై వరుస కోర్టు కేసులు తలనొప్పిగా మారాయి. ఈ సినిమా ద్వారా చరిత్ర కథలను వక్రీకరిస్తున్నారని కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు అలాంటిదే ఒక కేసు నమోదయింది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

కలిస్తే ఎలా ఉంటుంది
బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన రాజమౌళి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ ప్రధాన పాత్రధారులుగా రౌద్రం రణం రుధిరం(RRR) అనే సినిమాను తెరకెక్కించారు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. చరిత్రలో కలవని ఇద్దరు స్వతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుంది అనే సినిమా రూపొందిస్తున్నట్లు జక్కన్న కటించారు.

అనేక వాయిదాల తర్వాత
ఈ RRR సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్ లాంటి కీలక నటీనటులు నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తూ ఉండగా రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఇక అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా జనవరి ఏడవ తారీఖున థియేటర్లలో విడుదల చేయాలి అని భావిస్తూ రాజమౌళి నిర్ణయం తీసుకున్నారు.

మరో రూపంలో కష్టాలు
అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా ఇప్పుడు సినిమాకి కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా విడుదల కాకుండా చూడాలని ఒక మహిళ కోర్టుకెక్కగా ఇప్పుడు మరొకరు కోర్టును ఆశ్రయించారు.

పోలీసుగా చూపడం దారుణం
విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'RRR' చిత్రంలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆయన ఈ ప్రకటనలో ఆరోపించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్ పోలీసుగా చూపడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

భ్రష్టు పట్టించినట్టే
ఈ విషయమై సినిమా మేకర్స్‌పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వివరించారు. అల్లూరి, కొమరం భీమ్‌లు కలిసినట్టు చరిత్రలో లేదని, అటువంటిది వీరిని కలిపి చిత్రంగా చేస్తుండడం భావితరాలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు చరిత్రను భ్రష్టు పట్టించినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కల్పిత కథ అని, స్వాతంత్య్ర పోరాటంలో ఆ మహా వీరులిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఎలా వుంటుందనే కోణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని' రాజమౌళి సమాధానం చెప్పడం తగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని పడాల వీరభద్రరావు డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











