అక్రమాలు: ‘బాహుబలి’ టికెట్లపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం జులై 10న విడుదలవుతున్న నేపథ్యంలో గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి టికెట్ల అమ్మకాలపై హైకోర్టులో గురువారం పిల్(ప్రజా ప్రయోజనాల వాజ్యం) దాఖలైంది. నరసింహ రావు అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేసారు.
బాహుబలి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం సినిమాపై హైప్ పెంచారు, దీంతో అభిమానులు టికెట్ల కోసం గొడవలకు దిగుతున్నారు. గతంలో మగధీర చిత్రానికి సంబంధించి ఇదే విధంగా జరగడంతో ఏడుగురు మరణించారని, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రేక్షకుల ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉందని పిల్ లో పేర్కొన్నారు. ఈ తరుణంలో థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రదర్శనను పరిమితం చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రేపు విచారించనుంది.

ఫస్ట్‌క్లాస్ టికెట్లను వారం పాటు ఆన్‌లైన్‌లో అమ్మాలని థియేటర్ యాజమానులను ఆదేశించినట్లు విశాఖ పట్నం జాయింట్ కలెక్టర్ నివాస్ తెలిపారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. థియేటర్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జేసీ సత్య నారాయణ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











