మంచు లక్ష్మికి జోడీగా ధనరాజ్....(ఇది ఫేక్ పోస్టరేనా?)
హైదరాబాద్: మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ‘పిలవని పేరంటం' అనే సినిమా నిన్న ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కమెడియన్ ధనరాజ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా నడిచే ఈ హర్రర్ కామెడీలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది. ధన్ రాజుని మరో ప్రధాన పాత్రకు తీసుకున్నారు.
ధన్ రాజ్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా అత్యుత్సాహంతో తను హీరోగా నటిస్తున్న చిత్రం అని చెప్పటంతో మంచు లక్ష్మి సీరియస్ అయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్. దానికి తోడు మీడియాలో ఎక్కడ చూసినా మంచు లక్ష్మికి జోడిగా ధన్ రాజు అంటూ వార్తలు వచ్చాయి. ధన్ రాజు తీరు నచ్చని మంచు లక్ష్మి అతన్ని వెంటనే సినిమా నుండి తీసేయించిందని అంటున్నారు. దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.
ఓ వైపు ఈ వార్తల జోరు ఇలా కొనసాగుతుంటే....ధన్ రాజ్ తన సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లో ‘పిలవని పేరంటం' పోస్టర్లు పోస్టు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ ఫోస్టర్లు రియల్ కాదని, ఫేక్ అని చూసిన వారంటున్నారు. సినిమా హీరో తానే అనే విధంగా ఫోజు కొడుతూ ధనరాజ్ ఈ పోస్టర్లో ఫోజులు ఇచ్చాడు. అసలు ధనరాజ్‌కు ఈ చిత్రంలో ఇంకా చోటు ఉందా? తీసేసారనే కోపంతో ఈ ఫేక్ పోస్టర్లు పోస్టు చేస్తున్నాడా? లేక ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసం జరుగుతున్న హైడ్రామానా? అనేది తేలాల్సి ఉంది.

ఇది ఫేక్ పోస్టరే అంటున్నారు
థనరాజ్ తన సోషల్ నెట్వర్కింగు సైట్లో పోస్టు చేసిన ఈ ఫోటో ఫేక్ పోస్టర్ అని అంటున్నారు.

పిలవని పేరంటం
ప్రియదర్శిని మూవీస్ మరియు జైన్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర ప్రారంబోత్సవంలో రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మంచు లక్ష్మి
రొటీన్ సినిమాల్లో రోటీన్ పాత్రలు చేయకుండా...విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికే ప్రాముఖ్యత చూపుతున్న నటి మంచు లక్ష్మి త్వరలో ‘పిలవని పేరంటం' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దర్శకత్వం
‘పిలవని పేరంటం' చిత్రానికి వెంకన్న బాబు దర్శకుడు. గతంలో ఆయన ‘జగన్ నిర్దోషి' చిత్రానికి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











