హాస్యాస్పదంగా పిల్ల దొరికితే పెళ్లి....!?
బాలాదిత్య హీరోగా, గీతాసింగ్ హీరోయిన్ గా నటించిన 'పిల్ల దొరికితే పెళ్లి" చిత్రాన్ని ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం తొలికాపీ సిద్ధం చేసుకుంది. త్వరలో డిటిఎస్ పూర్తి చేసి నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'సినిమా టైటిల్ ఆసక్తిని రేకిత్తిస్తుంది. ప్రతి పెళ్లికాని మగాడు పిల్ల ఈజీగా దొరుకుతుంది అని అనుకుంటూ వుంటాడు. ప్రస్తుతం స్త్రీ గర్భం దాల్చగానే స్కానింగ్ చేయిస్తున్నారు. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గి మగపిల్లల సంఖ్య పెరుగుతున్న విషయం మనకు తెలుస్తున్న విషయమే..
ఆడపిల్లల సంఖ్య తగ్గినప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్న మగానికే డిమాండ్ వుంటుంది. ఇలాంటి అంశాలను చర్చిస్తూ పిల్ల దొరికితే పెళ్లి చిత్రం రూపొందింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. చిత్రాన్ని నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు. సాయికృష్ణ ముంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం లో ఇంకా అభినయశ్రీ, రవళి, ఏవిఎస్, కొండవలస, తెలంగాణశకుంతల తదితరులు నటించనున్నారు.


Click it and Unblock the Notifications











