'పిల్లా నువ్వు లేని జీవితం' విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం'. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని వాసు, హర్షిత్‌ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు. సినిమా చిత్రీకరణ పూర్తై రీసెంట్ గానే ఆడియో విడుదలైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత మీడియా సమావేశంలో తెలియచేసారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన జగపతిబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీహరిగారు చేయాల్సిన పాత్రను ఆయన చేశాడు అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ- బన్నీకి మా బ్యానర్‌లో ఆర్య, పరుగు చిత్రాలు పెద్ద హిట్‌గా నిలిచాయి. అలాగే సాయిధరమ్‌కు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. దిల్ టైమ్‌నుంచి అనూప్‌తో మంచి పరిచయం ఉంది. అతనితో ఎప్పుడో సినిమా చేయాలి. కానీ కుదరలేదు. ఈ సినిమాకి అనూప్ అందించిన మ్యూజిక్ పెద్ద హిట్‌గా నిలిచింది అన్నారు.

 Pilla Nuvvu Leni Jeevitham to hit theatres on Nov 14

దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ- రెండు పెద్ద సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేను దర్శకుడిని అవడం అదృష్టంగా భావిస్తున్నాను. ధరమ్‌తేజ్ అద్భుతంగా నటించాడు. అతనికి హీరోగా మంచి గుర్తింపు తెచ్చే సినిమా ఇది. అనూప్ అన్ని పాటలను అద్భుతంగా చేశాడు అని అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ మాట్లాడుతూ- రెండు పెద్ద బ్యానర్లలో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆడియో ఇంత పెద్ద హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. తప్పకుండా సినిమా కూ పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.

అలాగే... ''ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే కుర్రాడి కథ ఇది. సాయిధరమ్‌తేజ్‌ నటన, రెజీనా అందం ప్రధానాకర్షణగా నిలుస్తాయి'' అన్నారు. ''ప్రేమ, యాక్షన్‌ అంశాల్ని కలగలిపి దర్శకుడు సినిమాను చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మంచి స్వరాల్ని అందించారు.''అన్నారు నిర్మాతలు.

చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి, నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X