సాయి ధరమ్ తేజ డాన్స్ ఇరగదీసాడు (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : సాయధరమ్ తేజ్, రెజీనా జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై ఎ. ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో బన్ని వాసు, హర్షిత్ రూపొందిస్తున్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ రోజు విడుదల చేసారు. ఆ టీజర్ ఇదే.

నిర్మాతలు మాట్లాడుతూ... జగపతిబాబు తమ సినిమాలోకి రావడంతో భారీ అంచనాలు వచ్చాయని, మంచి కథకు వైవిధ్యమైన కమర్షియల్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సినిమాను రూపొందిస్తున్నరని, పాటలను , సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Pilla Nuvvu Leni Jeevitham - Ninnu Sudagane Song Teaser

దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. '' అన్నారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... ఇది నా రెండో సినిమా ఈ సినిమాకు కళ్యాణ్ మామయ్య నటించిన గబ్బర్ సింగ్ లో విజయవంతం అయిన పిల్లా నువ్వు లేని జీవితం అనే పాట పల్లవిని టైటిల్ గా పెట్టడం సంతోషంగా ఉంది. ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.


ఇతర పాత్రల్లో చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి, నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X