‘పిల్లా నువ్వులేని జీవితం’ సాయి ధరమ్ తేజ్ బర్త్ డే (టీజర్)
హైదరాబాద్: గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం'. ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని హర్షిత్, బన్నివాస్ నిర్మిస్తున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని అక్టోబర్ లేదా నవంబర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు(అక్టోబర్ 16) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ విడుదల చేసారు.

ఈ చిత్రంలో మొదట శ్రీహరిని అనుకుని సీన్స్ షూట్ చేసి, ఆయన మరణంతో జగపతిబాబుని తీసుకు వచ్చారు. ఆ విషయమై జగపతిబాబు మాట్లాడుతూ... శ్రీహరిగారంటే నాకు చాలా అభిమానం ఇష్టం. 'పిల్లానువ్వులేని జీవితం' సినిమాలో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలి.. అని అడిగినప్పుడు ముందు 'వద్దు' అని చెప్పేశా. కానీ తప్పలేదు. కానీ.. షూటింగ్‌కి వెళ్లేముందు శ్రీహరి ఫొటోకి దండం పెట్టుకొని వెళ్లా అన్నారు.
చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నబాబు, వేమారెడ్డి, నిర్మాతలు:బన్ని వాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.
ఏదేమైనా మొదటి సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘రేయ్' విడుదల కాక ముందే రెండవ సినిమా విడుదలకు రెడీ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











