మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టిన మేనల్లుడు (ఫోటోస్)
హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ను హీరోగా గీతా ఆర్ట్స్, వెంకటేశ్వర పతాకాలపై అల్లుఅరవింద్, రాజు రూపొందించిన ‘పిల్లా నువ్వులేని జీవితం' చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన సినిమాలో రెజీనా కథానాయిక.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ...నేను సినిమాల్లో నటిస్తాను అన్నప్పుడు మా అమ్మ, మామయ్య పరువు తీయొద్దురా అని చెప్పారు. ఆ మాటను నిరంతరం గుర్తుపెట్టుకొని చిత్రంలో కష్టపడి నటించే ప్రయత్నాన్ని చేశా. నేను కొత్తగా పేరు తేవాల్సింది ఏమీ లేదు....పరువు నిలబెట్టే విధంగా అయినా చేస్తే చాలు అని అనుకున్నాను' అని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.
ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, మారుతి, అనూప్ రూబెన్స్, రఘుబాబు, హేమ, షఫీ, పృథ్వీ, రజిత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

జగపతి బాబు మాట్లాడుతూ...
శ్రీహరి గారి ప్లేసులో నన్ను తీసుకునే సరికి మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. బోయపాటి నన్ను ఎలాగైతే కొత్త యాంగిల్ లో చూపిచాడో....ఇందులో కొత్తగా చూపించారు. నాకు ఇదో పెద్ద ఛాలెంజ్. చిత్రంలో చేసిన మైసమ్మ పాత్ర సరికొత్తగా ఉండటంతో నచ్చింది. ఈ పాత్ర ఓ డమీగా ఉండకూడదని, కథ లుక్ బాడీలాంగ్వేజ్ అన్నీ సరికొత్తగా ఉండేలా ప్రయత్నించాను అని జగపతిబాబు అన్నారు

దర్శకుడు మాట్లాడుతూ..
తొలి సిటింగ్‌లోనే సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. సినిమాకు ఎంత కష్టపడ్డానో నిర్మాతలు అంతే కష్టపడ్డారు. శ్రీహరి పాత్రలో జగపతిబాబును ఎంపిక చేశాక కూడా ఏదో వెలితి ఉండేది. జగపతిబాబు ఈ చిత్రంలో నటించాక ఆ వెలితి తీరిపోయింది అని దర్శకుడు రవికుమార్‌చౌదరి అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ...
నిర్మాతలు అల్లు అరవింద్ మాట్లాడుతూ, దిల్ రాజు మాట్లాడుతూ..... అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఆకట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు. హీరో ఎవరైనా మంచి చిత్రాన్ని ఆదరిస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు అన్నారు.

రెజీనా మాట్లాడుతూ...
ఈ సినిమా సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నా క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేసారు. సినిమా విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.


Click it and Unblock the Notifications











