అగ్రహీరోలతో ఢీ అంటున్న ‘పిల్ల జమిందార్’

By Bojja Kumar

కథానాయకుడు నాని అగ్రహీరోలతో పోటీ పడబోతున్నాడు. అతను నటించిన 'పిల్ల జమిందార్‌" సినిమాను దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దాదాపు కొన్ని రోజులు అటూ ఇటూ తేడాతో అగ్రహీరోలైన మహేష్ బాబు 'దూకుడు", బాలయ్య 'శ్రీరామ రాజ్యం", జూనియర్ ఎన్టీఆర్' ఊసరవెళ్లి" చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి ఈ పోటీలో పిల్ల జమిందార్ భవిష్యత్ ఏమిటో? చూడాలి.

ఇక పిల్లఃజమిందార్ సినిమా విషయానికొస్తే.. హరిప్రియ, బిందుమాధవి ఈ చిత్రంలో కథానాయికలు. అశోక్‌ దర్శకుడు. శ్రీశైలేంద్ర సినిమాస్‌ పతాకంపై మాస్టర్‌ ఎస్‌.ఎస్‌. బుజ్బిబాబు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సమర్పకులు డి.ఎస్‌.రావు మాట్లాడుతూ 'పూర్తిగా వినోదాత్మకమైన చిత్రమిది. దసరాకు విడుదల చేస్తున్నాం. నాని కెరీర్‌లో మరో హిట్‌ చిత్రమౌతుంది. పాటలను సెప్టెంబర్‌ మూడవవారం విడుదల చేస్తాం" అని తెలిపారు.

ఇందులో ఇంకా..ఎమ్‌.ఎస్‌.నారాయణ, డాశివప్రసాద్‌, నాగినీడు, రావురమేష్‌, సమీర్‌, రణధీర్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. మాటలు: చంద్రశేఖర్‌, సంగీతం :సెల్వగణేష్‌, కెమెరా : సాయిశ్రీరామ్‌, కూర్పు: ప్రవీణ్‌, దర్శకత్వం :అశోక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X