నాని ‘పిల్ల జమిందార్’ రీమేక్ డిటేల్స్
నాని, హరిప్రియ, బిందుమాధవి కాంబినేషన్ లో వచ్చిన 'పిల్లజమిందార్"చిత్రం త్వరలో తమిళంలోకి రీమక్ అవబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను విమల్ అనే హీరోతో నిర్మించాలని ఓ తమిళ నిర్మాత ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి రైట్స్ తీసుకున్నారు. తమిళంలో సైతం అశోక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో వచ్చి చిన్న చిత్రాల్లో పెద్ద చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం యాభై రోజుల పండగను ఘనంగా నిర్మాత డి.ఎస్ రావు జరిపారు. ఈ సందర్భంగా దర్సకుడు అశోక్ మాట్లాడుతూ... తమిళ కథల్లో ఉన్నంత పట్టు మన కథల్లో ఉండదు అనే అపప్రధ ఎప్పటినుంచో ఉంది. దానిని దూరం చేసే కథలు మనకూ రావాలి. అందులో భాగంగా చేసిన ప్రయత్నమే మా 'పిల్ల జమిందార్". వేరే భాషల్లో కూడా ఈ కథ తెరకెక్కనుంది. మరో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తా అన్నారు.
ఇక హీరో నాని మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతల రాజీలేని తత్వం వల్లే ఈ సినిమా ఇంతటి విజయం సాధించిందని హీరో నాని చెప్పారు. అనంతరం నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ.. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి 'పిల్ల జమిందార్" విజయం ఓ నిదర్శనం అన్నారు. అని డీఎస్‌రావు చెప్పారు. ఈ పంక్షన్ లో తమ్మారెడ్డి భరద్వాజ్, బెల్లంకొండ సురేష్, నీలకంఠ, శర్వానంద్, ఉదయ్ కిరణ్, వరుణ్ సందేశ్ తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











