బెగ్గర్స్ అన్న మోహన్ బాబు....పిండం పెట్టిన బ్రాహ్మణులు!
హైదరాబాద్ : 'దేనికైనా రెడీ ' చిత్రానికి సంబంధించిన బ్రాహ్మణులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా ఆందోళన చేస్తున్న బ్రాహ్మణులపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేసాయి. మోహన్ బాబు ఇంటి ముందు నిన్న బ్రాహ్మణ సంఘాల నేతలు ఆందోళన కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై మోహన్ బాబు స్పందిసూ.....వాళ్లు నిజమైన బ్రాహ్మణులు కాదని, చందాలు అడుక్కోవడానికి వచ్చి ఉంటారని, వేదం చదివే బ్రాహ్మణ పండితులు ఇలా చేయరని, ఆందోళన పేరుతో వాళ్లు చందాలు అడుక్కోవడానికి వచ్చారని....ఒకరకంగా వారిని బ్లాక్ మెయిలర్స్ గా, పరోక్షంగా చందాలు అడుక్కునే బెగ్గర్స్ గా అభివర్ణించి వివాదానికి తెరలేపారు మోహన్ బాబు.
మోహన్ బాబు వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి గురైన బ్రాహ్మణులు....మోహన్ బాబుకు పిండం పెట్టి తమ నిరసన తెలిపారు. చందాలు వసూలు చేసి ఆ చెక్కులను మోహన్ బాబుకు పంపారు. తమ ఆందోళన కార్యక్రమాలను మోహన్ బాబు ఎగతాళి చేయడంపై మండి పడ్డారు. బ్రాహ్మణులను బాధపెట్టిన వాడు బాగుపడ్డట్లు చరిత్రలో లేదని శాపనార్థాలు పెట్టారు. ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేస్తామని, లీగల్ గా అప్రోచ్ అవుతామని హెచ్చరించారు.
పరిస్థితి చూస్తుంటే బ్రాహ్మణులు 'దేనికైనా రెడీ' చిత్రంపై చర్యలు తీసుకునే వరకు బ్రాహ్మణులు వదిలేట్లు కనపడుట లేదు. మోహన్ బాబు వ్యాఖ్యాలు వారిని మరింత ఆగ్రహానికి గురి చేసాయి. ఆందోళనలకు దూరంగా ఉన్న బ్రాహ్మణులు కూడా మోహన్ బాబు వ్యాఖ్యల నేపథ్యంలో కదం తొక్కేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











