twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు విష్ణుకు కూడా పిండ ప్రదానం

    By Srikanya
    |

    గుంటూరు: 'దేనికైనా రెడీ' హీరో విష్ణు.. బ్రాహ్మణ సంఘ నాయకులపై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేయడం పట్ల బ్రాహ్మణులు మండిపడ్డారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో గుంటూరులో ఆందోళన నిర్వహించారు. స్థానిక శంకర్‌విలాస్ సెంటర్‌లో.. విష్ణు దిష్టి బొమ్మను పాడెపై పెట్టి ఊరేగించారు.

    శాస్త్రోక్త్తంగా దహన సంస్కారం, పిండప్రదానం నిర్వహించారు. తాము గతంలోనూ, ఇప్పుడూ.. మోహన్‌బాబు, విష్ణుల రాక్షస ఆత్మలకే పిండ ప్రదానం చేశామని శ్రీధర్ శర్మ చెప్పారు. వారిలోని రాక్షసగుణాలు, ఆ సంస్కృతి తొలగి మనుషుల్లాగా ప్రవర్తించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తమ తండ్రి బతికి ఉండగానే పిండప్రదానం చేశారని, అందుకు కారణమైన 16మంది బ్రాహ్మణులపై చర్యలు తీసుకోవాలని మంచు విష్ణు నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు.

    మోహన్ బాబుకు పిండప్రదానం చేయడం వల్ల తమ తల్లి మంచం పట్టిందంటూ విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నారని.. అయితే వారు తీసిన 'దేనికైనా రెడీ' సినిమా చూసి 80 లక్షల మంది బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిని మానసిక ఆందోళన చెందుతున్నారన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మందా ప్రేమానందం, బ్రాహ్మణ సంఘ నాయకులు పలువురు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

    మంచు విష్టు హీరోగా వచ్చిన 'దేనికైనా రెడీ' సినిమాలో బ్రాహ్మణుల ఆత్మగౌరవం కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయని బ్రాహ్మణ సమాఖ్య నాయకురాలు సుమలత శర్మ అన్నారు. 'మహిళలను చేతగాని వాళ్లమనుకుంటున్నావా?' అంటూ విష్టుపై విరుచుపడ్డారు. విష్టును ఎక్కడికి వెళ్లిన తాము అడ్డుకుంటామని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేనికైనా రెడీ సినిమా వివాదంలో హీరో మంచు విష్ణు గురువారం నాంపల్లి కోర్టు వచ్చారు. సినిమా వివాదంపై వచ్చిన పిటిషన్ విచారణను కోర్టు డిసెంబర్ 7కు వాయిదా వేసింది.

    English summary
    The controversy surrounding the film 'Denikaina Ready' is continuing. Brahmin Associations which have performed Pinda Pradanam to Mohan Babu have now performed the same ritual to his son and hero of the film, Manchu Vishnu. After performing Pinda Pradanam in the Sankar Vilas Centre of Guntur, they have also performed his last rites.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X