Pindam Trailer Review మరణానంతరం ఏం జరుగుతుంది? ఆత్మలు హాని చేస్తాయా? పిండం ట్రైలర్ రివ్యూ

కలహి మీడియా బ్యానర్‌పై ప్రవాసాంధ్రుడు యశ్వంత్ దగ్గుబాటి నిర్మాతగా సాయికిరణ్ దైడా దర్శకత్వలో రూపొందించిన చిత్రం పిండం. శ్రీరామ్, ఈశ్వరీరావు, శ్రీనివాస్ అవసరాల, రవివర్మ, మాణిక్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో నటించారు. సస్పెన్స్, హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో భాగంగా పిండం సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..

మరణం నిజంగా జరుగుతుందా? మరణించిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలరా? మరణించిన వ్యక్తి కోరికలు తీరకపోతే వారి ఆత్మ భూమిపై ఉండిపోతుందా? అలాంటి ఆత్మలు నిజంగా హాని చేస్తాయా? అనేవి అందరిలో ఉండే ప్రశ్నలే. ప్రజల మనసులో ఉండే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా సినిమా ఉంటుందనే అభిప్రాయాన్ని ట్రైలర్ కల్పించింది.

Pindam Telugu Movie Trailer Review: Ghost related Suspense, Horror Thriller

ఇక పిండం ట్రైలర్‌లో చూపించిన ప్రకారం.. ఓ పాడుబడిన ఇంటిలోకి శ్రీరామ్ కాపురం పెట్టడం.. దానిలో ఆత్మలు తిరిగినట్టు పిల్లలకు అనిపించడం లాంటి అంశాలు ఆసక్తికరంగా కనిపించాయి. ఇంటిలో చోటు చేసుకొన్న సమస్యలకు కారణం ఆత్మలు? దయ్యాలేనా? అనే థ్రిల్లింగ్ అనిపించాయి.

అయితే మంత్ర తంత్ర విద్యులు తెలిపిన ఈశ్వరిరావు ఇంటిని పరిశీలించిన తర్వాత.. మీ ఇంటిలో ఉన్న ఒక్క ఆత్మ కాదు..రెండు ఆత్మలు అంటూ బాంబు పేల్చడం స్టోరీలో హారర్ మూమెంట్స్ కనిపించాయి. ఇక మీ చిన్న అమ్మాయి జాగ్రత్త హెచ్చరించడం ట్రైలర్‌లో సెంటిమెంట్‌ను రుచి చూపించారు. ఆత్మలకు అమావాస్యకు చెక్ పెట్టకపోతే.. ఏడాది వరకు వేచి చూడాల్సిందే అంటూ ట్రైలర్ ద్వారా హైప్ పెంచే ప్రయత్నం చేశారు.

ట్రైలర్ చివర్లో ఈశ్వరీరావు మాట్లాడుతూ.. ఒక వస్తువును నరికినా, పూడ్చినా, తగులబెట్టినా అవి నశించవు. అవి అంతమై పోతాయని భ్రమపడుతాం. కానీ వాటిలో అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం అంటూ ట్రైలర్ ముగించడంతో పిండం సినిమాపై ఓ రకమైన అంచనాలు ఏర్పడ్డాయి.

నటీనటులు: శ్రీరామ్, కుషీ శ్రీ, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మీ, శ్రీలత తదితరులు

రచన, డైరెక్టర్: సాయికిరణ్ దైడా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
సినిమాటోగ్రఫి: సతీష్ మనోహరన్
మ్యూజిక్: కృష్ణ సౌరబ్ సురంపల్లి
ఎడిటర్: శిరీష్ మీడియా
రిలీజ్ డేట్: 2023-12-15

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X