twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెప్పుతో కొట్టేలా ఉన్నారు: శ్రీరెడ్డిపై పింగ్ పాంగ్ సూర్య ఫైర్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Ping Pong Surya Makes Serious Comments On Sri Reddy

    తెలుగు హీరోలు, నిర్మాతలు, దర్శకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారిన నటి శ్రీరెడ్డిపై తెలుగు నటుడు పింగ్ పాంగ్ సూర్య ఫైర్ అయ్యారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కేవలం పబ్లిసిటీ, ఫేం కోసమే ఆమె ఇదంతా చేస్తోంది అంటూ సూర్య మండి పడ్డారు. ఆమె కనబడితే మొత్తం అందరూ చెప్పులతో కొట్టేట్లు ఉన్నారు. ఆమె ఇండస్ట్రీని దిగజార్చి రోడ్డు మీదకు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.

    ఫ్రూఫ్స్ లేకుండా ఆరోపణలా?

    ఫ్రూఫ్స్ లేకుండా ఆరోపణలా?

    వాళ్లు వాడుకున్నారు, వీళ్లు వాడుకున్నారు అని చెబుతోంది. ఇందులో ఎంత వరకు నిజం అనేది ఎవరికీ తెలియదు. ఆమె వద్ద ప్రూఫులు ఏమీ లేవు. కేవలం ఫేం కోసం వేలాడుతూ ఇదంతా చేస్తోంది. ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసుకుని అందరినీ బదనాం చేస్తోంది. ఆమె ఇలా చేయడం కరెక్ట్ కాదు... అని సూర్య అన్నారు.

    అందుకే తమిళ ఇండస్ట్రీపై పడింది

    అందుకే తమిళ ఇండస్ట్రీపై పడింది

    నిజం ఏమిటనేది టాలీవుడ్లో అందరికి తెలిసింది. తెలుగులో ఆమెను ఎవరూ నమ్మడం లేదని వెళ్లి తమిళ ఇండస్ట్రీ మీద పడింది. వారిని టార్చర్ చేయడం మొదలు పెట్టింది. కేవలం ఫేం కోసమే ఇదంతా చేస్తోంది.

    శ్రీ శక్తి అంటే ఇదేనా?

    శ్రీ శక్తి అంటే ఇదేనా?

    తన పేరును శ్రీ‌శక్తిగా మార్చుకున్నట్లు చెప్పింది. శ్రీ శక్తి అంటే ఎలా ఉండాలి. మాట్లాడే మాటకు ఒక కారణం, విలువ ఉండాలి. ఆరోపణలు చేస్తే ఆధారాలు ఉండాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. పెద్ద వాళ్ల మీద కామెంట్స్ చేస్తే నా గురించి మీడియాలో రాస్తారు అనే ఇదంతా చేస్తోంది. ఆమె చెప్పేదాంట్లో నిజం లేదు.

    వాళ్ల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి

    వాళ్ల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి

    ఆమె చేస్తున్న ఆరోపణల వల్ల నిర్మాతలు, హీరోలు చాలా కష్టంగా ఫీలవుతున్నాయి. ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేక పోయినా ఆ ఆరోపణల వల్ల వాళ్ల ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. నీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కేసు పెట్టు, కోర్టులో కేసులు వేయ్. అంతే కానీ ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది.

    తమిళ్ వాళ్లు అంత సాఫ్ట్ కాదు

    తమిళ్ వాళ్లు అంత సాఫ్ట్ కాదు

    ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఏం చేసింది? ఏమైనా సినిమాల్లో నటించిందా? ఆమె సినిమాలు చేసినట్లు, నటి అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. కేవలం పవన్ కళ్యాణ్‌ను తిట్టడం వల్ల వారి మీద వీరి మీద ఆరోపణలు చేయడం వల్ల వార్తల్లోకి ఎక్కింది. తెలుగు వారు సాఫ్ట్ కాబట్టి వదిలేశారు. తమిళంలో పరిస్థితి అలా ఉండదు... అని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.

    English summary
    Ping Pong Surya fires on Sri Reddy over casting couch allegations. Ping Pong Surya said Sri Reddy allegations are not true.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X