సుమంత్ సినిమాలో విదేశీ హీరోయిన్
హైదరాబాద్ : హీరో సుమంత్ త్వరలో 'ఏమో గుర్రం ఎగరవచ్చు' అనే చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా విదేశీ భామను ఎంపిక చేసారు. బ్యాంకాక్(థాయ్‌లాండ్) చెందిన సవికా చైయదేచ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పటికే తమిళ సినిమా 'మార్కండేయన్' ద్వారా ఇండియన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సవికా చైయదేచ్ నిక్ నేమ్ పంకీ. ఇక్కడ అంతా ఆమెను పింకీ సవికా అని పిలుస్తుంటారు.
'ఏమో గుర్రం ఎగరవచ్చు' చిత్రానికి చంద్రసిద్ధార్థ దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత, దర్శకుడు మదన్ 'ఆ నలుగురు ఫిలిమ్స్' పతాకంపై ఈ సినిమా నిర్మించబోతున్నారు. రాజమౌళి 'మర్యాద రామన్న'కు కథ అందించి, 'ఈగ'కు స్క్రిప్టు రైటర్ గా పనిచేసిన కాంచి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు.
గతంలో సుమంత్-చంద్రసిద్ధార్థ కాంబినేషన్లో 'మధుమాసం' సినిమా వచ్చింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నాయి. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందుస్తున్నారు. సగం ఇండియాలోనూ, సగం అమెరికాలోనూ కథ జరుగుతుంది. అందుకు తగిన విధంగా సినిమాను ఇక్కడ సగం, అక్కడ సగం చిత్రీకరించనున్నారు.
ఇటీవల ఈచిత్రం ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియలో అట్టహాసంగా జరిగింది. ఈచిత్రానికి కథ-మాటలు : ఎస్.ఎస్. కాంచి, కెమెరా : చంద్రమౌళి, ఆర్ట్స్ : నాగేంద్రబాబు, పాటలు : చైతన్య ప్రసాద్, సంగీతం : ఎంఎం. కీరవాణి, స్ర్కీన్ ప్లే-నిర్మాత : మదన్, సమర్పణ : నీల శంకర్, దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ.


Click it and Unblock the Notifications












