Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పైరసీ సీడీని చూసి షాక్.. వారినేం చేయాలో అర్థం కావడం లేదు.. నిఖిల్ ఆవేదన
ఓ సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. కోట్లకు కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తుంటే.. బయట పది రూపాయలకు ఇరవై రూపాయలకు పైరసీ చేసేస్తుంటారు. కొన్ని నెలల పాటు ఎంతో మంది అహర్నిశలు కష్టపడి తెరకెక్కించిన సినిమాను.. క్షణాల్లో పైరసీ చేసేసి సినీ పరిశ్రమను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా విడుదలయ్యే వరకు హిట్ అవుతుందా? లేదా? అన్న టెన్షన్ ఉంటే.. మరోవైపు పైరసీ అవుతుందేమోనన్న భయం కూడా పట్టుకుంటుంది.
పైరసీని అరికట్టడంలో విఫలం..
పైరసీ బూతాన్ని అరికట్టడంలో అటు పోలీసు యంత్రాంగం, ఇటు సినీ పరిశ్రమ విఫలం అవుతూనే వస్తోంది. రిలీజ్ కాని సినిమాలను కూడా పైరసీ చేసి బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతలా రెచ్చిపోతోన్నా వారికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
తాజాగా అర్జున్ సురవరం..
ఎన్నో రోజులు వాయిదా పడుతూ వచ్చిన నిఖిల్ సిద్దార్థ్ అర్జున్ సురవరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న అర్జున్ సురవరం మంచి వసూళ్లను సాధిస్తూ.. విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ పైరసీ సీడీలను చూసి నిఖిల్ షాక్‌కు గురయ్యాడు.
రోడ్డు పక్కన బండిపై..
టీ తాగుదామని రోడ్డు పక్కన ఆగితే.. పైరసీ సీడీలు కనిపించాయని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అయితే ఆ సీడీలను అమ్మేది ఓ మహిళ అని, ఆమె తన కుటుంబ పరిస్థితిని చెప్పుకుంటూ బాధపడటం లాంటి వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Recommended Video
ఏం చేయాలో అర్థం కావడం లేదు..
ఆవిడేమో.. ఫ్యామిలీ ఉందని చెబుతుందని, వీళ్లని ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. సినిమా వాళ్లకు కూడా ఫ్యామిలీ ఉంటుందని, వారెంతో కష్టపడి సినిమా తీస్తారని, ఇలా పైరసీ చేస్తే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండని, థియేటర్లోనే చూడండంటూ ప్రార్థించాడు.