For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పైరసీ భూతం మహా దారుణం.. రాత్రికి రాత్రే నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా HD ప్రింట్స్.. ఆ యాప్‌లోనే..

    |

    గత పదేళ్ళలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మారుతూ వస్తున్నాయి. టెక్నాలజీ పరంగా హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోకుండా మనవాళ్లు కూడా కాలంతో గట్టిగానే పోటీపడుతున్నారు. అయితే టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయినా కూడా ఒక్క పైరసీ భూతం మాత్రం అంతం కావడం లేదు. రాత్రి విడుదలైన నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు మొబైల్ ఫోన్లలో దర్శనమిచ్చే దుస్థితి ఏర్పడింది.

     ఓటీటీపై పైరసీ దెబ్బ..

    ఓటీటీపై పైరసీ దెబ్బ..

    థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో ఓటీటీ సంస్థలు ఈ లాక్ డౌన్ లోనే వాటి మార్కెట్ ని మరింత పెంచుకున్నాయి. కొత్త కొత్త సినిమాలను భారీ ధరకు దక్కించుకొని ఆడియెన్స్ చేత ఎకౌంట్ ఓపెన్ చేయించేలా చేస్తున్నారు. ఏడాది పాటు అన్ని సినిమాలు చూసుకోవచ్చని జనాలు కూడా మెల్లమెల్లగా వారికి నచ్చిన యాప్ ల వైపు యూ టర్న్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా పైరసీ భూతం ఓటీటీ సంస్థలను భయానికి గురి చేస్తోంది.

     ఒక్క క్లిక్ తో డౌన్ లోడ్ చేసుకునేలా..

    ఒక్క క్లిక్ తో డౌన్ లోడ్ చేసుకునేలా..

    ఇంతకుముందు అంటే తమిళ్ రాకర్స్, టొరెంట్ వంటి రాక రకాల దొంగ వెబ్ సైట్స్ హవా ఎక్కువగా నడిచేది. ఇప్పటికి కూడా అవిఅందుబాటులో ఉన్నప్పటికీ అంతకంటే వాటిని ఎంతో కొంత అడ్డుకునే అవకాశం ఉంది. అయితే అంతకంటే ఈజీగా మరొక దారిలో HD ప్రింట్స్ ఒక యాప్ లో దర్శనమిస్తున్నాయి. రాత్రికి రాత్రే ఒక్క క్లిక్ తో డౌన్ లోడ్ చేసుకునేలా ఆప్షన్ ఉండడంతో ఓ వర్గం వారు అదే ఫాలో అవుతున్నారు.

    లాక్ డౌన్ లో ఎక్కువ మంది వాడిన యాప్..

    లాక్ డౌన్ లో ఎక్కువ మంది వాడిన యాప్..

    టెలిగ్రామ్ అనే యాప్ ఇటీవల కాలంలో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. లాక్ డౌన్ లో జనాలు సినిమాలు చూసేందుకు ఎక్కువగా టెలిగ్రామ్ ని వాడుకున్నారు. కేవలం సెర్చ్ లో సినిమా పేరు కొడితే అనేక రకాల సినిమాల లింకులు దర్శనమిస్తున్నాయి. ఒక్క క్లిక్కుతో ఒరిజినల్ ప్రింట్స్ డౌన్ లోడ్ అవ్వడం మహా దారుణం.

    Bigg Boss Telugu 4 : Bigg Boss హోస్ట్ గా టాప్ హీరోయిన్.. గ్రాండ్ ఎంట్రీ ఆ రోజే!
    ఇలానే కొనసాగితే..నష్టం తప్పదు

    ఇలానే కొనసాగితే..నష్టం తప్పదు

    నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు రిలీజైన కొద్దిసేపటికె HD ప్రింట్స్ ఆ యాప్ లో బాగా వైరల్ అయ్యాయి. కేవలం. ఈ రెండు సినిమాలనే కాదు. లాక్ డౌన్ లో డైరెక్ట్ గా విడుదలైన చాలా సినిమాలు ఇదే తరహాలో లీకవుతున్నాయి. టెక్నలిజి ఎంత డెవలప్ అవుతున్న ఎంత గట్టిగా సెక్యూరిటీ ఉంచినా కూడా ఈ బాధ తప్పడం లేదు సినిమా ఇండస్ట్రీకి. ఇలానే కొనసాగితే ఓటీటీ సంస్థలకు భవిష్యత్తులో భారీ నష్టం తప్పదనే కామెంట్స్ వస్తున్నాయి.

    English summary
    The post-production work is yet to be postponed due to release in February in four languages. Due to Corona Lockdown, the theater closes for another two months and should not wait. It is not known what the conditions will be even after two months. That is why there was talk of Chance releasing the film on Digital World.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X