రేసు గుర్రం, రౌడీ: అలా చేస్తే జైలుకే అంటూ హెచ్చరిక

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు ఫ్యామిలీ మూవీ 'రౌడీ' ఈ నెల 4వ తేదీన విడుదలవుతోంది. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'రేసు గుర్రం' చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యాంటీ పైరసీ సెల్ నుండి వార్నింగ్ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ చిత్రాన్ని ఎవరు పైరసీ చేసినా...వెబ్ సైట్లు, యూట్యూబ్, టోరెంట్ సైట్, బ్లాగ్‌లో అప్‌లోడ్ చేసినా ఇది నేరం కింద పరిగణింపబడుతుందని యాంటీ పైరసీఅధికారులు వెల్లడించారు. ఇలాంటివి ఎవరి దృష్టికొచ్చినా [email protected]కి ఫిర్యాదులు పంపాలని అధికారులు తెలిపారు.

PIRACY WARNING : Rowdy & Race Gurram

'రేస్ గుర్రం' ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. శృతి హాసన్ హీరోయిన్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'రౌడీ'. 'రౌడీ' చిత్రంలో మోహన్‌బాబు, విష్ణు, జయసుధ, శాన్వి ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. రేపు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X