»   » ఆగని ‘బాహుబలి’ పైరసీ జోరు....!

ఆగని ‘బాహుబలి’ పైరసీ జోరు....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా ఓ వైపు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మరో వైపు పైరసీ కూడా జోరుగా సాగుతోంది. సినిమా విడుదల ముందు నుండే పైరసీని అడ్డుకునేందుకు రాజమౌళి అండ్ టీం పకడ్భంధీ ఏర్పాట్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. సినిమా విడుదలైన రోజే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చేసాయి.

ఇటీవలే హైదరాబాద్ పాత బస్తీలో వందలాది బాహుబలి పైరసీ సీడీలు పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలో 50 పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు నుండి బెంగుళూరు వెలుతున్న ప్రైవేట్ బస్సులో వీటిని తీసుకెలుతుండగా పలమనేరు పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు.


Pirated DVDs of Baahubali seized

కాగా....ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బాహుబలి' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లో ‘బాహుబలి' సినిమా అన్ని వెర్షన్లలోకలిపి ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.


తాము మూడేళ్లు పడిన కష్టానికి తగిన ఫలితాలు వస్తుండటంతో బాహుబలి సినిమా టీం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

English summary
Chittur Police on Monday seized 50 pirated DVDs of newly released Telugu film ‘Bahubali’ in private bus.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu