twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి దెయ్యం కథ ('పిశాచి' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ :తమిళ చిత్రం 'పిశాసు'ని తెలుగులో 'పిశాచి' పేరుతో అనువదించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.తమిళంలో పెద్ద హిట్‌ అయింది. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే అద్భుత కథతో తెరకెక్కిన చిత్రమది. కొత్త తరహా హారర్‌ సినిమా. మంచి చేసే ‘పిశాచి'గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది

    కథ ఏమిటంటే... ఓ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోతుంది. ఆమె దెయ్యంగా మారి తనను ఎవరైతే రక్షించటానకి ప్రయత్నించారో వారిని హంట్ చేయటం ప్రారంభిస్తుంది. అసలేం జరిగింది. ఈ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏమిటి అనేది ఈ చిత్రం కథ.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ... ‘‘కోనేరు కల్పన ఈ సినిమాను తీసుకుని మా సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నుంచి విడుదలైతే బావుంటుందని నన్ను సంప్రదించారు. ఇటీవల మా సంస్థలో ‘చంద్రకళ'ను హిట్‌ చేశాం. ఈ సినిమా దానికేమాత్రం తగ్గకుండా ఉంటుంది. పరీక్షల టెన్షన్‌లో ఉన్న విద్యార్థులకు ఈ చిత్రం మంచి రిలీ్‌ఫనిస్తుంది. సకుటుంబంగా చూడదగ్గ సినిమా. మంచి వాళ్ల జోలికి వెళ్లని దెయ్యం కథ. తెలుగు రాషా్ట్రల్లో 300కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.

    Pisachi movie preveiw

    ''చంద్రకళ చిత్రం నాకు అన్నివిధాలా సంతృప్తినిచ్చింది. ఆ తరహాలోనే.. భయం, వినోదం కలగలిపిన చిత్రం 'పిశాచి'. పిశాచి అని పేరు చూసి పెద్దలకు మాత్రమే అనుకోవద్దు. ఇది ఇంటిల్లిపాదికీ నచ్చే చిత్రం. ఎందుకంటే ఇందులో దెయ్యం చాలా మంచిది. 'పీకే'కి పోటీగా తమిళంలో విడుదలై మంచి వసూళ్లు అందుకొంది 'పిశాసు'. తెలుగులోనూ అదే ఫలితం వస్తుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

    ‘చంద్రకళ' సినిమా తరువాత మరో తమిళ సూపర్‌హిట్‌ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సి.కళ్యాణ్‌. మిస్కిన్‌ దర్శకత్వంలో తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి' సినిమాను సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సి.కల్యాన్‌, కల్పన అదే టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు. బాల ఈ చిత్రానికి సమర్పకులు.

    సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''మంచి పనులు చేసే ఒక దెయ్యం కథ ఇది. ఒక ఇంట్లోకి ప్రవేశించిన దెయ్యం ఏమేం పనులు చేసిందన్నది తెరపైనే చూడాలి. సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం మాకుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభించింది''అన్నారు.

    ఇక ‘‘మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్‌ అయింది. మనసుల్ని దోచుకునే ఓ దెయ్యం కథ ఇది. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలా అంతా కొత్తవారితో ఈ సినిమా నిర్మించారు. రొమాంటిక్‌ హారర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుదన్న నమ్మకం ఉంది. పెద్ద పోటీ మధ్య ఈ సినిమా రైట్స్‌ దక్కించుకున్నాను ' అని తెలిపారు.

    అలాగే... ''మనసుల్ని దోచుకొనే దెయ్యం కథతో రూపొందిన చిత్రమిది. తమిళంలో ప్రముఖ దర్శకుడు బాల నిర్మించారు. అక్కడ ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల్ని కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. '' అన్నారు.

    బ్యానర్: సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు :నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, కళ్యాణ్, నిమ్మి , హరీష్‌ ఉత్తమన్‌ కీలక పాత్రధారులు.
    కెమెరా: రవి రాయ్‌,
    సంగీతం: అరోల్‌ కొరేళి,
    మాటలు: శశాంక్‌,
    ఎడిటింగ్‌: గోపీనాథ్‌,
    సహ నిర్మాత: సి.వి.రావు,
    సమర్పణ: బాలా
    నిర్మాతలు: సి.కల్యాణ్‌, కోనేరు కల్పన.
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మిస్కిన్
    విడుదల తేదీ 27,02, 2015.

    English summary
    ‘Pisachi’ film is the dubbed version of Pissasu, a Tamil film which was praised for its refreshing take on the horror genre. Arrol Corelli has scored the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X