»   »  ఇదేం చిత్రం: బన్ని మ్యానరిజం...కోడి యాజటీజ్ దించేసింది (వీడియో)

ఇదేం చిత్రం: బన్ని మ్యానరిజం...కోడి యాజటీజ్ దించేసింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ మ్యానరింజగా.. ఈ మధ్యకాలంలో రేసు గుర్రంలో పెట్టన ద్యాముడా అనేది ఎంత పెద్ద హిట్టైందో మనకందరికీ తెలిసిందే. చిన్నా, పెద్దా అందరూ ఎంజాయ్ చేసి, వాడిన ఈ మ్యానరిజం, డైలాగు ఓ కోడి కూడా వాడింది. అదెలా అంటారా..ఇదిగో ఈ వీడియో లో చూస్తే మీకే అర్దమవుతుంది. ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హాట్ గా షేర్ అవుతోంది. మరి ఈ లోగా మీరు ఎందుకుచూసేయకూడదు..

ప్రారంభంలో ప్రాణాలను తీయడానికి ఓ వ్యక్తి కత్తిని పట్టుకుని, పచ్చని పోలాల్లో పరిగెడుతూ వుండటంతో ఈ షార్ట్ ఫిలిం మెదలౌతుంది. పరుగుపెట్టి....పెట్టి ఓ చోట ఆగి, మోహాం పై ఉన్న రక్తాన్ని ని తుడుచుకుని మళ్లీ పరుగందుకుంటాడు. అలసి పోయి ఓ చెరువుగట్టున కూర్చుంటాడు, అతని నుంచి ఓ రెండు చుక్కల రక్తం చెరువులో పడుతుంది, అప్పుడు ఎంటర్ అవుతాడు ఈ సినిమా హీరో (కోడిపుంజు గారు). ఎవరిని ఆయన చంపాలనుకున్నాడు..మధ్యలో ఈ కోడిపుంజు యవ్వారం ఏంటి...పైనల్ గా ఏం జరిగింది..అనేవి ఇంట్రస్టింగ్ గా చెప్పిన వీడియోలో చూడండి.

పిట్టకధల్ని మనం చిన్నప్పుడు చాలానే చెప్పుకుంటాం, చదువుకుంటాం. ఆందులో వుండే నీతిని పిల్లలకు నేర్పిస్తారు, వారి జీవితాలకు వుపయోగపడుతూ, జ్ఞానాన్ని పెంచుతుందని. ఇలాగే ఈ పిట్ట కధ కూడా ఓ చిన్నపాటి మెసేజ్ ని మోసుకు వస్తుంది. మనం ఏం చేయాలో , మనకు అన్నం పెట్టే రైతన్నును ఎలా గౌరవించుకోవాలో నేర్పుతుంది.

 Pittakadha film with Fun and Message

రైతు ప్రేమతో వేసే నాలుగు గింజలు తిని బ్రతికే కోడికే అంత విశ్వాసం తన యజమాని రైతు పట్ల ఉంటే...మనకు అన్నం పెట్టే ఈ రైతన్న ఆత్మహత్య చేసుకుంటూంటే మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న..ఈ షార్ట్ ఫిలిం మన మీదకు వదులుతుంది.

కళ్యాణ్ రాఘవ పసుపుల్ల రాసిన సైదలు అనే కథకు, దర్శకుడు ప్రదీప్ మీసాల సరైన న్యాయం చేసారు. ఇలాంటి మెసేజ్ ఓరియెంటడ్ కథను తీయటానికి ముందుకు వచ్చింది ఆర్కే నల్లం(క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్), అలాగే మహేష్ ఆచంట ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా ఓవర్ కాకుండా బాగుంది. అలాగే జోన్స్ అందించిన కెమెర్ వర్కు కూడా నీట్ గా ఉంది.

English summary
Here is Telugu short film "Pitta Katha". Original story was written by Kalyan Raghava Pasapula for Sakshi Sunday article named "Saidulu".Now it's been re-written and Directed by Pradeep Meesala
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu