వామ్మో.....హైదరాబాద్‌లో ఆ సినిమా 160 షోలు!
హైదరాబాద్: ‘3 ఇడియట్స్' చిత్రంతో భారీ విజయం సాధించిన తర్వాత అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పికె'. ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 4000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు.
అమీర్ ఖాన్ సినిమాలకు హైదరాబాద్ సిటీలో కూడా మంచి డిమాండ్ ఉండటంతో తొలి రోజు(డింసెబర్ 19) ఈచిత్రాన్ని హైదరాబాద్ వ్యాప్తంగా 160 షోలు ప్రదర్శిస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ రోజు ఎక్కువగా ఈ చిత్రాన్నినే ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే టికెట్స్ అన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోవడం గమనార్హం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ కలెక్షన్ల రికార్డులను ఈచిత్రం బద్దలు కొడుతుందని అంతా భావిస్తున్నారు. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. అమీర్ ఖాన్ సినిమాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈచిత్రం 300 కోట్లు చాలా ఈజీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ పతాకంపై రాజ్ కుమార్ హిరానీ, విదువినోద్ చోప్రా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సౌరభ్ శుక్లా, సంజయ్ దత్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











