twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పికె’ పైరసీ: ముఖ్యమంత్రిపైనే అనుమానం?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం ఇపుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ చిత్రంపై అనేక వివాదాలు, కోర్టు కేసులు ఉన్నాయి. హిందూ సంస్థలతో పాటు పలు ముస్లిం సంస్థలు కూడా ఈ చిత్రం తమ తమ మతాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

    ఆ వివాదాలు అలా ఉంటూ ఈ చిత్రం బావుందంటూ....ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వడం కూడా చర్చనీయాంశం అయింది. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ‘పికె' చిత్రం విషయంలో నోరు జారారు. సినిమాను డౌన్ లోడ్ చేసుకున్నానని, అయితే చూడటానికి సమయం చిక్కడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన సినిమా పైరసీ కాపీ డౌన్ లోడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

    PK Piracy? Akhilesh Yadav 'Downloads' a Controversy

    పైరసీ గోల పక్కన పెడితే...
    దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ వివాదాల నేపథ్యంలో మీడియా ప్రకటన చేసారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని, తాము అన్ని మతాలను, మత విశ్వాసాలను గౌరవిస్తామని తెలిపారు. అమీర్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

    పలు హిందూ సంస్థలతో పాటు, ముస్లిం సంస్థలు కూడా ఈ చిత్రంలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవతలను కించ పరిచే విధంగా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయంటూ కేసులు కూడా నమోదయ్యాయి.

    కాగా....సినిమాను ప్రదర్శన కొనసాగుతుందని, ఎలాంటి సీన్లు తొలగించాల్సిన అవసరం లేదని సెంట్రల్ సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. సినిమా ఎవరినీ కించ పరిచే విధంగా లేదన్నారు. ఎలాంటి సీన్లు తొలగించడానికి బోర్డు సిద్దంగా లేదని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ లీలీ శాంసన్ చెప్పారు.

    English summary
    Uttar Pradesh Chief Minister Akhilesh Yadav is facing scorn on social media after letting it slip that he downloaded the film "PK" and watched it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X