పికె న్యూడ్ పోస్టర్‌తో అమీర్ ఖాన్‌కు లీగల్ చిక్కులు
ముంబై: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పికే న్యూడ్ పోస్టర్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. తన మోడస్టీని ట్రాన్సిస్టర్‌తో కప్పేస్తూ అమీర్ ఖాన్ నగ్నంగా దర్సనమిస్తే ఫస్టు లుక్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ అమీర్ ఖాన్‌ను న్యాయపరమైన చిక్కుల్లో పడేసే పరిస్థితి వచ్చింది.
రాజ్‌కుమార్ పాండే అనే న్యాయవాది ఆ పోస్టర్‌పై భోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమ్లా నగర్ పోలీసు స్టేషన్‌లో అమీర్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు.

292, 294 సెక్షన్ల కింద ఇదే న్యాయవాది ఇంతకు ముందు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టు ఇంకా స్పందించాల్సి ఉంది. అమీర్ ఖాన్ పికె పోస్టర్ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తోందని, అందుకు అమీర్ ఖాన్‌పై కేసు నమోదు చేయాలని పాండే అంటున్నారు.
ఈ ఏడాది డిసెంబర్19న ప్రేక్షకుల ముందుకు రానున్న పికె సినిమాకి రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వం వహిస్తున్నారు. 'పీకే' సినిమా పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











